ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఏ పార్టీ గెలిచినా రెండో పార్టీకి కనీసం డిపాజిట్లు లేకుండా పూర్తి మెజారిటీతో గెలుస్తుంది.  అయితే ఈసారి టిడిపి కూటమి మాత్రం కనీసం వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎన్నికల్లో విజయం సాధించింది. ఇదే తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసిపి ఆంధ్రప్రదేశ్ లో కష్టాల్లో పడ్డదని చెప్పవచ్చు. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి, ఈ ఐదు సంవత్సరాలు కూటమిపాలనలో తమను తాము కాపాడుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనేక ప్లాన్లు వేస్తున్నారు. ఇదే తరుణంలో బిజెపికి వైసిపి తో కూడా అవసరం ఉంటుందని, వారు మాకు కూడా సపోర్ట్ చేస్తానని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

దీన్ని అడ్డుపెట్టుకొని కేంద్రంలో చక్రం తిప్పాలి అనుకున్నారు. కానీ ఆయన అనుకున్న దానికి రివర్స్లో కేంద్రంలో పరిస్థితులు ఉన్నాయి. జగన్ అవసరం ఇప్పటికే కేంద్రంతో తీరిపోయింది. ఇక జగన్ తో వారికి ఏం అవసరం లేకుండా పోయింది. అంతేకాదు చంద్రబాబుకు కేంద్రం పెద్దపీట వేస్తోంది. ఇదే అదునుగా భావించిన చంద్రబాబు జగను ను ఎలాగైనా కేంద్రం సపోర్ట్ తో దెబ్బ తీసి జైలుకు పంపాలని పార్టీ లేకుండా చేయాలని ప్లాన్లు వేస్తున్నారు. కానీ జగన్ మాత్రం కేంద్రానికి నా అవసరం ఉందని వారు అలా చేయరని భావించారు. ఈ క్రమంలోనే జగన్ కు బిజెపి షాక్ ఇచ్చింది.

 అయితే బిజెపికి వైసిపి అవసరం ఇక ఉండదని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం రాజ్యసభలో 229 మందిలో ఎన్డీఏకు 105 మంది సభ్యులు ఉన్నారు. మరో ఆరుగురు నామినేటెడ్ సభ్యులు కూడా బిజెపికే మద్దతు ఇస్తున్నారు. అలాగే ఉప ఎన్నికలవేళ 12 రాజ్యసభ స్థానాల్లో 11 బిజెపి మిత్రపక్షల ఖాతాలో ఏకగ్రీవంగా పడనున్నాయి. అంటే 122 మంది సభ్యుల బలం ఉందన్నమాట. దీంతో వైసీపీ మద్దతు  బిజెపికి అక్కర్లేదని తెలిసిపోయింది. ఇక జగన్ కేంద్రంపై పెట్టుకున్న ఈ కాస్త ఆశలు కూడా నిరాశలుగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: