ఇందులో సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఒక వ్యవస్థ అనేది అందుబాటులో ఉండేటువంటిది. అలాగే కార్పొరేట్ వైద్యం పేదవాడికి అందాలన్నదే.. వాళ్ల నాన్న పెట్టినటువంటి విధానాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. దానిని 25 లక్షల రూపాయల వరకు తీసుకువెళ్లడం అనేది జగన్మోహన్ రెడ్డి స్టైల్.. అదే సందర్భంలో మరొకవైపు చూసుకుంటే రైతు భరోసా కేంద్రం కావచ్చు, హెల్త్ క్లినిక్స్ కావచ్చు, ప్రజలకు అవసరమైనటువంటి విద్య, వైద్యం, వసతి, తిండిబట్ట వసతి ప్రభుత్వ వైపు నుంచి రేషన్ ఇవ్వడం కానీ.. ఇల్లు ఫ్రీగా ఇవ్వడం కానీ విద్య వైద్యం ప్రభుత్వ బాధ్యతగా వ్యవహరించేవారు.
చంద్రబాబు స్టయిల్ ఇందులో పిపిపి స్టైల్ గా మారిపోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి ఇన్సూరెన్స్ సిస్టంలోకి తీసుకువెళ్లారు. అన్న క్యాంటీన్లను తాతల ద్వారా చేయించడం వల్ల.. ఇక రోడ్లను కూడా పి పీ పి స్టైల్ లో తీసుకు వెళ్లడం జరుగుతోంది. ఆయనది ఆ టైపులో ఉంటుంది. ఈ అన్నది ఈ టైపులో ఉంటుంది.. జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేకపోవచ్చు.. కొన్ని రోడ్లను ప్రభుత్వం చేతనే వేయించడం ప్రారంభించారు.. వేశారు కూడ.. మెయిన్ రోడ్లు వేయలేకపోయారు.. ఈలోపు ఆయన దిగిపోయారు. ఇలా ఒక్కొక్క లది ఒక్కో విధానం ఉంటుంది.