ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మందుబాబులకు అదిరిపోయే శుభవార్త అందింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. నాణ్యమైన మద్యం అందించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే.. మందుబాబులకు అదిరిపోయే శుభవార్త అందించింది చంద్రబాబు నాయుడు సర్కార్. కొత్త మద్యం పాలసీ.. ప్రొక్యూర్మెంట్ పాలసీపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కసరత్తు పెట్టడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై అధ్యయనం చేస్తోన్నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ.
మద్యం కొనుగోళ్ల పాలసీ పైనా వివిధ మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చించడం జరిగింది. అంతేకాదు... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్లకు అనుమతులివ్వనుంది చంద్రబాబు నాయుడు సర్కార్. ఇక ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి ప్రముఖ బ్రాండ్లు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది చంద్రబాబు నాయుడు సర్కార్. తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోనుంది చంద్రబాబు నాయుడు సర్కార్.
వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లు రూ. 100 లోపే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. అంటే... ఒక్కో క్వార్టర్ రూ. 90 నుంచి రూ. 80 మధ్య ఉండేలా చర్యలు తీసుకోనున్నారన్న మాట. తక్కువ ధర మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. మినిమం ధర రూ. 200గా ఫిక్స్ చేసింది వైసీపీ సర్కార్. అయితే... తక్కువ ధర మద్యం అందుబాటులో లేకపోవడంతో గంజాయికి ఏపీ మందుబాబులు అలవాటు పడ్డట్టు చంద్రబాబు సర్కార్ గుర్తించింది.
గంజాయి వినియోగం పెరగడానికి జగన్ ప్రభుత్వ విధానాలే కారణమని తమ అధ్యయనంలో తేలిదంటున్నంది చంద్రబాబు సర్కార్. అక్టోబర్ నెల నుంచి అమల్లోకి కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకువస్తున్నట్లు తెలిపారు ఏపీ అధికారులు. ఇక చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తో ఏపీ మందు బాబు ఖుషీ అవుతున్నారు.