అయితే ఇందులో ఉన్న చిక్కు ఏమిటంటే.. దేవాదాయ శాఖ భూమి ఉన్నటువంటి వాటిలో ఎవడబ్బ సొమ్మని ఆ భూమినీ ఇస్తారు.. దేవాలయ మాన్యాల తో ఉన్నటువంటి వాళ్లకు మాత్రం..22A ప్రకారం ఇవ్వడానికి వీలు లేదు. అది ఎన్ని వందల సంవత్సరాలైనా సరే.. ఆ శాఖ పరిధిలోనే ఉండాలట. లేకపోతే అది అమ్మి ఆ డబ్బులు తీసుకువచ్చి మరి.. ఆ గుడి యొక్క అకౌంట్లో డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అలా వచ్చిన వడ్డీతో ఆలయ నిర్వహణలో సైతం చేయవలసి ఉంటుందట. ఇది కరెక్ట్ విధానం.
అలాకాకుండా ఇచ్చేసేయడం అన్నటువంటిది.. జగన్ సర్కార్ చేసిన తప్పు. ఇప్పుడు వాటిని ఏ బెండ్స్ లో పెట్టడం ద్వారా చంద్రబాబు సర్కార్ మంచి పని చేసింది. కానీ మూడు నెలల తర్వాత తెలుగుదేశం నేతలు కార్యకర్తలు సైతం అవి అమ్ముడుపోవని తెలిస్తే.(అంటే రిజిస్ట్రేషన్ తమ పేరు మీద జరగవంటే) ఎంతకు కొంతకు సైతం రాసి ఇచ్చేస్తారు.. అప్పుడు అమరావతిలో జరిగినట్టుగా. అలా రాసిచ్చాక అప్పుడు మళ్లీ ఆ భూమి యొక్క ఏబెండ్స్ తొలగించి.. తమ పార్టీ వాళ్లకు రాసి ఇవ్వడం కాకుండా దేవాదాయ శాఖ భూములు ఒక్కదానిని మాత్రం కాపాడడంలో జాగ్రత్త వహించాలి ఏపీ ప్రభుత్వం. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిదే.. మరి కూటమి ప్రభుత్వం మేం చేస్తుందో చూడాలి మరి.