ఈ మార్గంలోని జాతీయ రహదారిని ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేగా మార్చననున్నారు. జాతీయ రహదారి ప్రాధికార సంస్ధ ఇందుకు సంబంధించి శరవేగంగా అడుగులు వేస్తుండటం కొసమెరుపు. గతంలో ఈ పనులకు సంబంధించిన టెండర్లను జీ.ఎం.ఆర్ సంస్థ దక్కించుకోవడం జరిగింది. అయితే ఆ సంస్థ వేర్వేరు కారణాల వల్ల ఈ పనుల నుంచి వైదొలగిన నేపథ్యంలో ఆ సంస్థ స్థానంలో మరో కాంట్రాక్టర్ ఎంపిక దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.
ఈ జాతీయ రహదారిని విస్తరించడానికి ఏకంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని ఇందుకోసం టెండర్లను పిలవబోతున్నారని సమాచారం అందుతోంది. ఈ రహదారి తెలంగాణ పరిధిలో 181 కిలోమీటర్లు ఉండగా గతంలోనే ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించడం జరిగింది. ఆ సమయంలో వేర్వేరు రీజన్ల వల్ల ఆరు లైన్ల విస్తరణ చేయడం వీలు కాలేదు.
అయితే అప్పటికే భూ సేకరణ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగా భూ సేకరణ చేయకుండానే పనులు జరగనున్నాయి. ఒక ప్రైవేట్ సంస్థకు డీపీఆర్ కు సంబంధించిన పనులను అప్పగించనున్నారని సమాచారం అందుతోంది. వేగంగా ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని భోగట్టా. ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా పూర్తైతే ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ పనులు పూర్తైతే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణ వేగం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అత్యంత రద్దీ హైవేలను ఆరు వరుసలుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి మహర్దశ. అంటూ ఆరు లైన్ల విస్తరణ పనులపై నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ రహదారి ఎంత స్పీడ్ గా పూర్తైతే అంత స్పీడ్ గా అభివృద్ధి జరగనుంది.