బిఆర్ఎస్ కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభ పక్షాన్ని ఏర్పాటు చేయించి సీఎల్పీ లో విలీనం చేయించేందుకు రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారని ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాలకు ముందే రేవంత్ రెడ్డి బీర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతారు. ఇక కాంగ్రెస్‌కు ప్రాథినిథ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ చివరి నియోజకవర్గ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ - రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ - పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడులను ఆహ్వానించేందుకు రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే బిజెపి పెద్దలతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు అని.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడులను ఆహ్వానించేందుకు రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి రేవంత్ వచ్చిన వెంటనే ఈ ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేస్తారంటున్నారు.