-నిత్యం వేలాది వాహనాల ప్రయాణం..
- హైదరాబాద్ to ముంబై ప్రయాణికులకు మహర్దశ..
ఒకప్పుడు ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే చిన్న చిన్న రోడ్లు ఇరుకైన ప్రాంతాల నుంచి ప్రయాణం చేసేవారు. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. పూర్తిగా రోడ్లు అప్ గ్రేడ్ అయ్యాయి. హైవే ల నుంచి నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్ హైవేలు కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అలా మన దేశంలో చెప్పుకోవలసిన సూపర్ హైవే ముంబై టు హైదరాబాద్ ను కలుపుతూ ఉన్నటువంటి జాతీయ రహదారి. ఈ రహదారి గుండా రోజు వేలాది వాహనాలు ప్రయాణం చేస్తాయి. వేలాదిమంది ఈ రహదారి వెంబడి బ్రతుకుతారు. అలాంటి ఈ రహదారి ప్రయాణికులకు రాజబాటగా మారింది. మరి ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా కలుపుకొని వెళ్తుందో ఇప్పుడు చూద్దాం..
ఎన్ హెచ్ 65 ..దీన్ని దేశంలోనే రిచెస్ట్ హైవేగా పిలుస్తుంటారు. హైదరాబాద్ నుంచి పశ్చిమాన ఏ రూట్ అయితే ఉంటుందో దాన్ని హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే అని పిలుస్తారు. నేషనల్ హైవే 65 అనేది మహారాష్ట్ర, పూణే దగ్గర మొదలై కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయి మచిలీపట్నం దగ్గర ఎండ్ అవుతుంది. నేషనల్ హైవే 65 రెండు భాగాలుగా డివైడ్ చేశారు. ఇందులో ఒకటి తూర్పున ఉండే భాగం. హైదరాబాదు నుండి చౌటుప్పల్, సూర్యాపేట, కోదాడ, నందిగామ, విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉంటుంది. దీన్ని హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే అని పిలుస్తారు. ఇక రెండవది పశ్చిమ భాగంలో ఉండే హైదరాబాద్ టు ముంబై హైవే. పూణే నుండి టెంబుర్ని, సోలాపూర్, నల్బుర్గ్, హోమనాబాద్, ఒమార్గ, బసవ కళ్యాణం, జహీరాబాద్, సంగారెడ్డి మీదుగా హైదరాబాద్ కలుస్తుంది.