తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లిన తర్వాత... ఆయన పర్యటనపై తీవ్రమైన విమర్శలు కూడా వస్తున్నాయి. పెట్టుబడుల కోసం అమెరికాకు రేవంత్ రెడ్డి వెళితే.. హైదరాబాదులో ఉన్న కంపెనీలు కూడా బయటకు వెళ్తున్నట్లు కొంతమంది వార్తలు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కేవలం టైం పాస్ కోసం అని ప్రచారం జరుగుతుంది.

 

తన తమ్ముడి కంపెనీని.. తీసుకువచ్చేందుకు అమెరికా వరకు రేవంత్ రెడ్డి వెళ్ళాడని సెటైర్లు కూడా పేలుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో...  ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్  వేసిన ఓ కథనం... పెద్ద దుమారాన్ని రేపుతోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ప్రచురణ అయింది. అయితే..  కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి కాదని... కాంగ్రెస్ లోని మంత్రులు అలాగే ఇతర కాంగ్రెస్ నేతలని... అందులో ప్రచురించారు.

 అయితే ఈ కథనం  ప్రచురించడం వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయని.... కొంతమంది కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. రేవంత్ రెడ్డి కావాలని ఎల్లో మీడియాలో.. ఇలాంటి వార్తలను వేయిస్తున్నాడని.. కర్గేతో పాటు రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేసినట్లు... ఢిల్లీలో చర్చ జరుగుతోందని సమాచారం. అంతేకాకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి... తనకు నచ్చిన వారికి టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీశాడని కూడా ఫిర్యాదు చేశారట.

 అందుకే కాంగ్రెస్ పదికి పైగా సీట్లు గెలవాల్సింది... 8 సీట్లకే పరిమితమైనట్లు... కూడా అధిష్టానానికి చెప్పారట.  దీంతో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా రేవంత్ రెడ్డి పైన చాలా సీరియస్ గా ఉన్నారట. ఏ క్షణమైన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఒకవేళ ఈ సంఘటన బాగా సీరియస్ అయితే రేవంత్ రెడ్డి పై  వేటు కూడా పడే ఛాన్స్ ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: