బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అన్న సామెత మనకు తెలిసిందే. నిన్నటి వరకు తిరుగులేని హీరోలుగా ఉన్నవారు రేపు జీరోలు అవుతారు. నిన్నటి వరకు జీరోలుగా ఉన్నవారు రేపు హీరోలు అవుతారు. అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది.. మూడు నెలల వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న‌ వైసిపి తిరుగులేని చక్రం తెప్పింది. వైసీపీకి చెందిన పలువురు నేతలు.. పదవులు అధికారం అనుభవించేందుకు పోటీపడ్డారు. పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి రివర్స్ అయింది. నిన్నటి వరకు అధికారం అనుభవించి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన నేతలు అందరూ ఇప్పుడు గప్‌చుప్‌ అయిపోతున్నారు. ఏ పదవి ఇస్తానన్నా కూడా మాకు వద్దు బాబాయ్ అంటున్నారు.


పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకులు మాకు పదవులు కావాలి.. మాకు పదవులు కావాలి అని తన్నులాడుకున్న పరిస్థితి. ఎప్పుడు అయితే పార్టీ ఘోరంగా ఓడిపోయిందో ? ఆ పార్టీ నుంచి కేలకనేత్ర అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రిగా మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడంతో పాటు ప్రస్తుతం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళ నాని తన పదవులతో పాటు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పదవి ఇస్తామంటుంటే ఏ వైసీపీ నేత కూడా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.


కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గతంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పుప్పాల వాసు బాబు - దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి .. ఇలా ఎవరు కూడా ఈ పదవి మాకు వద్దు బాబోయ్ అని అంటున్నారట. జగన్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న అబ్బ‌య్య‌ చౌదరికి ఈ పదవి ఇద్దామని అంటున్న చౌదరి కూడా ఈ పదవి తీసుకునేందుకు ఏమాత్రం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జెట్టి గురునాథరావు లేదా జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ భర్త ప్రసాదరావు పేర్లు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: