సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. కొన్ని రోజులుగా విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి వేర్వేరు పేర్లు వినిపించినా ఎవరి పేరు ఫైనల్ కాలేదు. వైసీపీకి మెజార్టీ అభ్యర్థుల మద్దతు ఉండటంతో టీడీపీ పోటీ చేసినా ఓటమి పాలు కాక తప్పదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక లాంఛనమే అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేయగా ఆయన నామినేషన్ ను ఉపసంహరించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. బరిలో నిలిచి గెలవని పక్షంలో పరువు పోతుందని భావించి టీడీపీ ఈ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో వైసీపీకి మంచి మెజార్టీ ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామని చెప్పిన కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబు ప్రకటనతో సైలెంట్ అయ్యారు. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. బొత్స సత్యనారాయణ శాసనమండలిలో అడుగు పెడితే వైసీపీకి రాజకీయంగా ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. వైఎస్ జగన్ ఇప్పుడిప్పుడే సరైన దారిలో అడుగులు వేస్తున్నారని ఒక విధంగా ఎన్నికల ఫలితాల తర్వాత దక్కిన ఈ విజయం వైసీపీకి దక్కిన తొలి విజయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.