అలాగే ఏ ప్రాంతానికి అయితే రహదారులు బాగుంటాయో ఆ ప్రాంతంలో కొత్త కొత్త కంపెనీలు వచ్చే వెసులు బాటు కూడా చాలా వరకు ఉంటుంది. దానితో గడిచిన ఐదేళ్ల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక జాతీయ రహదారులను నిర్మించింది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక జాతీయ రహదారులను నిర్మించే విషయంపై దృష్టి సారించింది.
ఇకపోతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో కొన్ని జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పూర్తి చేయడం కూడా జరిగింది. ఇకపోతే మరికొన్ని ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కొంత కాలం క్రితమే నేషనల్ హైవే 363 పనులు వేగవంతం అయ్యాయి.
ఈ నేషనల్ హైవే మంచిర్యాల జిల్లాలోని మందమర్రి , బెల్లంపల్లి , తాండూర్ , ఊర్ల మీదగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన , వాంకిడి ఊర్ల మీదుగా ఇది మహారాష్ట్ర సరిహద్దు వరకు వెళ్లనుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభం అయిన ఈ రహదారి పనులు దాదాపు ఇప్పటికే పూర్తి అయ్యాయి.
మరికొన్ని రోజుల్లో ఈ రహదారికి సంబంధించిన పనులు అన్నీ పూర్తి కాబోతున్నాయి. ఈ రహదారి ద్వారా ఇటు మంచిర్యాల మరియు అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులకు ఎంతో మేలు జరగనుంది. ఈ ప్రాంతాల ప్రజలకు ఈ రహదారి ద్వారా చాలా తొందరగా ప్రయాణించే వెసులు బాటు కలగనుంది.