- 2029 ఎన్నికల్లో శ్రీరామ్ ను ఎమ్మెల్యే చేయడమే టార్గెట్‌గా రాజకీయం
- టీడీపీ లోకి క్యూ కడుతోన్న వైసీపీ వీరాభిమాన కుటుంబాలు
- ( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ ) .
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ యేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కనీసం ఎవరూ ఊహించని విధంగా 11 సీట్లకే పరిమితం అయ్యింది. అసలు జగన్ కు ప్రతిపక్ష నేత హోదా గౌరవం కూడా దక్క లేదు. అంత ఏకపక్షంగా ఏపీ ఓటరు తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇంత ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో ఉండేందుకు పార్టీ కేడర్ కూడా ఇష్ట పడలేదు.
ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే - మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న దూకుడు రాజకీయం దెబ్బకు ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గం లో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి. అసలు నియోజకవర్గం లో వైసీపీకి ఎంత మాత్రం చోటు లేకుండా చేయాలన్న వ్యూహంతో సునీత ముందుకు వెళుతున్నారు. రాప్తాడులో 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తర్వాత టిడిపి కార్యకర్తలను క్షేత్రస్థాయిలో చాలామందిని వైసీపీ వైపు మళ్ళించారు.
అయినా ఈ ఎన్నికలలో సునీత పోరాడి విజయం సాధించారు. వాస్తవంగా 2019 ఎన్నికలలో ఇక్కడ నుంచి శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికలలో చంద్రబాబు శ్రీరామ్ ను కాదని సునీతను పోటీ చేయించారు. ఇక సునీత మాత్రం 2029 ఎన్నికల నాటికి అయినా తనయుడు శ్రీరామ్ ని ఎలాగైనా ఎమ్మెల్యే ను చేయాలని కంకణం కట్టుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో బలమైన టిడిపి క్యాడర్ను తమ వైపునకు తిప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో వైసీపీ కీలక నేతలపై గురి పెట్టి అక్కడ వైసీపీని వీక్ చేస్తున్నారు.