2014 వ సంవత్సరం ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం మొదటి సారి అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగు దేశం పార్టీ కి చాలా అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం జరిగింది.

ఇక 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పార్టీకి పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలు రాలేదు. వైసీపీ పార్టీకి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో వైసిపి పార్టీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేయగా వైసిపి ఒంటరిగా పోటీలోకి దిగింది. ఇక వైసిపి మొదటి నుండి కూడా ఈ సారి పోయిన సారి కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటాం అని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చింది. కానీ రిజల్ట్ మాత్రం వీరికి ఘోరమైన దెబ్బ కొట్టింది.

వైసీపీ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. దీనితో ఈ పార్టీకి అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేకుండా పోయింది. ఓటమి వరకు ఓకే కనీసం అసెంబ్లీ లో అయినా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కి కొంత మంది సభ్యులు ఉన్నట్లు అయితే వీరు అధికార పార్టీని గట్టిగా నిలదీసే అవకాశం ఉండేది.

ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ని మినహాయిస్తే గట్టిగా మాట్లాడే వ్యక్తులు ఎవరు ఈ పార్టీ నుండి అసెంబ్లీ లో లేరు. దానితో ఈ పార్టీకి అసెంబ్లీ లో ఇది ఎంతో మైనస్ గా మారింది. అసెంబ్లీ లో కనుక వైసిపి పార్టీ నుండి కూడా కొంత ఎక్కువ శాతం మంది ఉండి , అందులో అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన కొంత మంది నేతలు ఉండి ఉంటే ప్రతిపక్షంగా వైసిపి బలంగా కనబడేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడం ఈ పార్టీ కి చేదు అనుభవంగా మిగులుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: