ఇక వినాయక చవితి వచ్చిందంటే ఊరువాడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. సాధారణంగా ఏదైనా పండుగ వస్తే ఒకటి రెండు రోజులు మాత్రమే పండగ శోభ సంతరించుకుంటూ ఉంటుంది. కానీ వినాయక చవితి వస్తే మాత్రం ఇక గణనాథుడికి పూజలు చేసే నవరాత్రులు కూడా అటు గ్రామ గ్రామాన పండగ శోభ సంతరించుకుంటుంది. ఎక్కడ చూసినా గణనాథుడి పాటల వినిపిస్తూ ఉంటాయి. అయితే గణనాథుడు నిమజ్జనం కార్యక్రమ ఊరేగింపులు కూడా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలలో పాల్గొంటూ ఉంటారు. అయితే అసలు ఈ గణేష్ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.
రాష్ట్రకూట, శాతవాహన, చాళుక్యుల కాలం నుంచి ఈ గణేష్ చతుర్థిని జరుపుకుంటున్నారట. ఇక ఆ తర్వాత చత్రపతి శివాజీ మహారాజ్ గణేష్ చతుర్ధిని జరిపించడం కొనసాగించారట. ఇక ఆ తర్వాత పీష్వా రాజవంశం కూడా దీనిని కొనసాగించిందట. అయితే 1893లో పూణేలో తొలిసారిగా బహిరంగంగా గణేష్ ఉత్సవాలు మొదలుపెట్టారు. జాతీయోద్యమంలో భాగంగా హిందువులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు బాలగంగాధర్ తిలక్ ఇక ఈ ఉత్సవాలను నిర్వహించారట. ఇక అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వినాయక చవితి వచ్చిన ప్రతిసారి కూడా ఈ గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం కొనసాగిస్తూ వస్తున్నారు.