ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షానికి తోడు బుడమేరుకు పడిన గండ్లు విజయవాడ ను ముంచిత్తాయి. కనీ విని ఎరిగిన స్థాయిలో వరద పోటెత్తాడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుందన్న సూచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే మకాం వేసి మరి కష్టపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 74 సంవత్సరాల వయసులో కూడా యువకుడిగా అక్కడ పనిచేస్తున్నారు. వరదలోనే పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు . . ఇక బుడమేరుకు పడిన గండ్లు పుడిచితేనే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుంది అన్న సూచనలతో మంత్రి నిమ్మల రామానాయుడు చూసిన చూపించిన చొరవ అందరిని ఆకట్టుకుంది.
దాదాపు 64 గంటల పాటు నిద్ర లేకుండా బుడమేరు కట్టపైనే మకాం వేసి అధికారులు ... సిబ్బందితో గండ్లు పూడ్చి వేసే పనుల ను పర్యవేక్షించిన నిమ్మల సహచర మంత్రి నారా లోకేష్ అభినందించారు. బుడమేరు మూడోగండి పూడ్చి వేత పనులను పరిశీలించేందుకు వచ్చిన లోకేష్ మంత్రి నిమ్మల కష్టాన్ని గుర్తించి అభినందించారు. ఓ రాత్రి ఈదురు గాలులతో వర్షం పడిన నిమ్మల ఆ జోరు వర్షం లో తడుస్తూనే పనులు చేయిం చిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏదేమైనా నిమ్మల టోటల్ విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు తో పాటు ఎంతో మంది మంత్రులు కష్టపడినా చంద్రబాబు తర్వాత ఆ రేంజ్‌లో నిమ్మల మాత్రమే హైలెట్ అయ్యారు.
ఈ క్రమంలోనే బుడమేరు మూడో గండి పూడ్చి వేత పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన మరో మంత్రి .. పార్టీ యువనేత నారా లోకేష్ నిమ్మల పడుతోన్న కష్టం చూసి ప్రత్యేకంగా అభినందించారు. ఏదేమైనా విజయవాడ వరదల దెబ్బకు నిమ్మ ల బాగా హైలెట్ అయిపోయారు.