ఆ ఇంటి మేడపై శనివారం దివ్వల మాధురి ఉండగా ఆ ఇంటి మేడ బాల్కనీపై మాధురి ఉండటం చూసి అవాక్కైన దువ్వాడ వాణి ఆ ఇంటి దగ్గరకు వెళ్లి హడావిడి చేశారు. ఆ ఇంట్లోకి వెళ్లడానికి శుక్రవారం రోజున న్యాయస్థానం తనకు అనుమతులు ఇచ్చిందని ఇంతలోనే రిజిస్ట్రేషన్ ఏ విధంగా జరిగిందని దువ్వాడ వాణి దివ్వెల మాధురిని నిలదీసే ప్రయత్నం చేయగా కొద్దిసేపటికి అక్కడినుంచి వెళ్లిపోయారు.
దివ్వెల మాధురి ఈ ఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చేశారు. తాను రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఇంటిని కొనుగోలు చేయడం జరిగిందని భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే వాటిని వాళ్లిద్దరూ తేల్చుకోవాలే తప్ప తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె కోరారు. దివ్వల మాధురి ఇచ్చిన ట్విస్ట్ తో ఈ ఘటన విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.
దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ట్విస్టులు ఇక్కడితో ఆగిపోతాయో లేక కొనసాగుతాయో చూడాల్సి ఉంది. దివ్వల మాధురి పేరుపై ఇల్లు రిజిస్ట్రేషన్ జరిగిన నేపథ్యంలో వాణి మళ్లీ కోర్టును ఆశ్రయిస్తారా అనే చర్చ సైతం జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ఈ వివాదానికి శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. దువ్వాడ వివాదం ఏపీ పొలిటికల్ వర్గాల్లో తరచూ హాట్ టాపిక్ అవుతోంది.