* 2012 ఉపఎన్నికల్లో 15 స్థానాలు కైవసం.!
* అధికార
కాంగ్రెస్ కు చుక్కలు చూపించిన వైనం..!
* జడ్పీటీసీ నుండి హోంమంత్రిగా ఎదిగిన సుచరిత.!
*
మాచర్ల, ప్రత్తిపాడు ఉపఎన్నికల్లో
కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు..!
(ఏపీ-ఇండియాహెరాల్డ్): ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో 2009లో జరిగిన ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పుకు కారణం అయ్యాయి.అప్పటి ఎన్నికలలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, మరియు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లాంటి పార్టీల మధ్య పోటీ అనేది రసవత్తరంగ జరిగింది.అయితే అప్పటికే కాంగ్రెస్ 2004 లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచి పాలన సాగిస్తూ ఉంటే అపుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎనిమిది కోట్ల ఆంధ్ర ప్రజల్ని నట్టేట ముంచేసారు.చిరంజీవి పెట్టిన పార్టీ ప్రభావం అనేది తెలుగుదేశంపై అత్యధికంగా పడి టీడీపీను 2009 ఎన్నికలలో ఓటమి చవిచూసేలా చేసింది.అయితే 2009 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రెండోసారి వైయస్సార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.అయితే 2009లో ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం మరియు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.అధికార కాంగ్రెస్తో విభేదాల కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి,వైసీపీని స్థాపించడం కోసం కాంగ్రెస్ నుండి బయటకు వస్తూ ఆయనతో పాటు పద్దెనిమిది ఎమ్మెల్యేలు బయటకి వచ్చి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.దాంతో కాంగ్రెస్ అధిష్టానం వారందరిపై అనర్హత వేటు వేసింది.అలా బయటకు వచ్చిన పద్దెనిమిది మందిలో గుంటూరు జిల్లా నుండి మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణరెడ్డి ఉన్నారు.అయితే అప్పుడు ఆ పద్దెనిమిది స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది.ఎన్నికల అనంతరం మొత్తం 18 స్థానాల్లో వైసీపీ పోటీ చేయగా వైసీపీకి 15,అధికార కాంగ్రెస్కు2,తెరాస1 స్థానాల్లో గెలిచాయి.అయితే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును వెబ్ కెమెరా ద్వారా కౌంటింగ్ ను నిర్వహించడం విశేషం.అయితే వైసీపీ గెలిచినా 15 స్థానాల్లో దాంట్లో గుంటూరుజిల్లాకు సంబంధించిన ప్రత్తిపాడు మరియు మాచర్ల రెండు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు సైతం కోల్పోయింది.ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ తరపున సుచరిత, టీడీపీ నుండి కందుకూరి వీరయ్య,కాంగ్రెస్ నుండి సుధాకర్ బాబు బరిలోకి దిగితే వైసీపీ అభ్యర్థి సుచరిత 16783 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.అలాగే మాచర్లలో వైసీపీ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, టీడీపీ నుండి చిరుమామిళ్ల మధు, కాంగ్రెస్ నుండి పిన్నెల్లి లక్ష్మారెడ్డి బరిలోకి దిగితే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణరెడ్డి తన మార్క్ చూపించారు.మాచర్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు సైతం కోల్పోవడం అనేది అధికార కాంగ్రెస్కు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.అయితే ఈ ఎన్నికల తర్వాత వైసీపీ రాజకీయంగా పుంజుకుంది. అయితే తనకంటూ రాజకియంలో ఒక స్టార్డం తెచ్చుకున్న జగన్ 2014 ఎన్నికల్లో సొంత పార్టీతో బరిలోకి దిగిన వైసీపీకి టీడీపీ ఝలక్ ఇచ్చి ఓటమి చవిచూసేలా చేసింది.అయితే ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నో అనుభవాలు నేర్చుకున్న జగన్ 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర బాగా కలిసోచ్చి 2019 ఎన్నికల్లో తిరిగి వైసీపీ తన మార్క్ చూపించి 151 సీట్లు సాధించి అధికారం చేతబట్టింది.దాంతో తనను నమ్మి తన వెంట వచ్చిన నాయకులకు జగన్ అధికారం చేపట్టాక వారందరికీ పార్టీలో సముచితస్థానం కేటాయించారు.అలాంటి వారిలో సుచరిత ఒకరు. ఆమె దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో రాజకీయ రంగప్రవేశం చేశారు.ఆమె మొదట 2006లో జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా వైయస్సార్ టికెట్ ఇచ్చారు దాంతో ఆమె ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు.తర్వాత జరిగిన వైయస్సార్ మరణంతో జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయినా సరే అయిదు ఏళ్ళు ప్రజలకు అందుబాటులోనే ఉంటూ జగన్ దృష్టిలో ఉండి 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి టికెట్ పొంది గెలిచారు దాంతో జగన్ కాబినెట్లో హోమ్ మంత్రిగా చేశారు.అలాగే జగన్ తనతో ఉన్న మరొక నేత పినెల్లికు కూడా సముచిత స్థానం కేటాయించారు.జగన్ దగ్గర పిన్నిల్లికున్న బంధం గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2009 నుండి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఘనత పిన్నిల్లికి ఉంది.