ఒకప్పుడు కేవలం వేలల్లో మాత్రమే పలికిన లడ్డు ధర..ఇక ఈసారి మాత్రం ఏకంగా లక్షల్లో పలికింది. కొన్నిచోట్ల ఏకంగా వినాయకుడి లడ్డుకి కోట్ల రూపాయల ధర పలకడం గమనార్హం. అయితే ఇలా ఎన్నో వినాయకుల దగ్గర వేళల్లో లడ్డు భారీ ధర పలికినప్పటికీ.. అటు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయినా బాలాపూర్ లడ్డు వేలం మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలాపూర్ లడ్డూ ఈసారి ఈ వేలంలో ఎంత ధర పలుకుతుంది అని తెలుసుకోవడానికి ప్రతి ఏటా అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు.
అయితే బాలాపూర్ లడ్డు లక్షల్లో వేలం పలుకుతూ ఉంటుంది. మరి ఇలా వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బులని ఏం చేస్తారు అన్న విషయం ఎవరికీ తెలియదు. కాగా 1994 నుంచి బాలాపూర్ లడ్డు ద్వారా వచ్చిన డబ్బులను గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. స్కూల్, రోడ్లు, ఆలయ నిర్మాణం, సీసీ కెమెరాలు ఏర్పాటు వరద బాధితులను ఆదుకునేందుకు ఆ నిధులను ఉపయోగిస్తూ వస్తున్నారు. దేనికోసం ఎంత వెర్చించారు అందరికీ తెలిసేలా బోర్డులను సైతం ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వేలం ద్వారా వచ్చిన డబ్బులతో తమ ఊరి రూపురేఖలు మారిపోయాయి అంటూ గ్రామస్తులు చెబుతూ ఉండడం గమనార్హం.