జగన్ మళ్లీ కార్యకర్తల్లో ధైర్యం నింపడంతో పాటు వాళ్లకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను నమ్ముకోవడం వల్లే జగన్ కు ఈ ఎన్నికల్లో ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు. వాళ్లను నమ్మకుండా పార్టీ కోసం నిజంగా కష్టపడిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే మాత్రం పరిస్థితులు మరో విధంగా ఉండేవని చెప్పడంలో సందేహం అయితే అక్కర్లేదు.
జగన్ ఇప్పటికైనా కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. గతంలో వైసీపీ సోషల్ మీడియా కోసం పని చేసిన వాళ్లు సైతం ప్రస్తుతం ఎందుకొచ్చిన తలనొప్పి అని ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. జగన్ ఇప్పటినుంచి సరైన అడుగులు వేస్తే మాత్రమే 2029లో పార్టీకి అధికారం దక్కే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
తప్పటడుగులు వేస్తూ వెళ్తే మాత్రం భవిష్యత్తులో ఎంత కష్టపడినా పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం అయితే ఉండదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. సరైన సలహాలు, సూచనలు ఇచ్చే సలహాదారులను జగన్ నియమించుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ అమలు చేసిన ఎన్నో పథకాలు ఇప్పుడు మారుపేర్లతో రాష్ట్రంలో అమలవుతున్న సంగతి తెలిసిందే. జగన్ తాను చేస్తున్న తప్పులను అర్థం చేసుకుంటే మాత్రమే భవిష్యత్తులో పార్టీకి విజయం దక్కుతుంది. జగన్ 2029 ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తరో చూడాల్సి ఉంది.