ఇప్పటికే కేజిఎఫ్ అనే సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీళ్లు ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ అనే మూవీ ని తీసి.. ఇక మరో బ్లాక్ బస్టర్ ని కూడా సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో సినిమా మొదలుపెట్టాడు. వచ్చే ఏడాది భారీ ఎత్తున రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక విషయంపై ప్రశ్న అడుగుతున్నారు.
ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు తెరకెక్కించిన కేజీఎఫ్, సలార్ మూవీస్ లో హీరోలకు అసలు తండ్రులే ఉండరు. ఎందుకంటే తండ్రి పాత్రలు చనిపోతే.. కేవలం తల్లి పెంచి పెద్ద చేస్తుంది. ఈ క్రమంలోనే తల్లి సెంటిమెంట్తో ఈ సినిమా మొత్తం సాగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ అందరికీ కూడా కొత్త అనుమానాలు వస్తున్నాయి. కనీసం తారక్ కి అయినా తండ్రి ఉంటాడా లేకపోతే కేవలం తల్లి మాత్రమే ఉంటుందా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో ప్రశాంత్ నీల్ భయ్యా కనీసం ఎన్టీఆర్ కు అయినా తండ్రి ఉంటాడ అంటూ ఇక ప్రశ్నలు అడుగుతూ ఉండడం గమనార్హం. అయితే ప్రశాంత్ నీల్ కి ఇలా తల్లి సెంటిమెంట్ తో సినిమా తీస్తేనే బాగా వర్క్ అవుట్ అవుతుంది. సూపర్ డూపర్ విజయం సాధిస్తుంది. ఇక ఇప్పుడు తన రెగ్యులర్ సెంటిమెంట్ నే ఇక తారక్ సినిమాకి వాడుతాడా లేదా చూడాలి.