అయితే ఆ సమయంలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం చేత వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో అప్పటినుంచి ఇప్పటివరకు కానిస్టేబుల్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. ఇందులో సివిల్-3580,APSP -2520 పోస్టులు ఉన్నవి.. అయితే ఇందులో ప్రిలిమనరి ఎగ్జామ్ కు మొత్తం 3,622 మంది హోంగార్డుల సైతం రాయగా కేవలం ఇందులో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించడంతో.. ఇందులో 100 మంది హోంగార్డులు రాత పరీక్షకు అర్హత సాధించని వారు 14 రిట్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది.
ముఖ్యంగా హోంగార్డులకు కేటాయించిన కేటగిరీని పరిగణంలోకి తీసుకోవాలని వారికి సంబంధించి మెరిట్ జాబితా అని ప్రకటించాలి అంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ వందమంది హోమ్ గార్డ్లను సైతం తదుపరి పరీక్షకు అనుమతించాలి అంటూ న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు వచ్చాయనీ హోం మంత్రి అనిత వివరించారు. అయితే ఈ విషయం పైన గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకోలేదని ఇప్పుడు తెలియజేశారు అయితే ఈ విషయం తమ దాకా వచ్చిందని దీనిపైన న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్తామని ఎందుకు సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫారం కూడా నింపడానికి అందుకు సంబంధించిన పూర్తి వివరాలను slprb.ap.gov.in వెబ్సైట్లో ఉంచామంటూ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. రెండవ దశలో సక్సెస్ అయిన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష ఉంటుంది అంటూ వెల్లడించింది.