- ధరల తగ్గింపు తాగడం వైపు మళ్లింపుకేనా?
- ఈ పాలసీ ప్రజలకు మేలా.. కీడా.?
మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం..ధరల తగ్గింపు మాకెంతో సంబరం.. ఒక క్వార్టర్ కాదు రెండు క్వార్టర్స్ లాగిస్తాం అంటూ పాడుకుంటున్నారు కొంతమంది ఆంధ్రప్రదేశ్ లోని మందుబాబులు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మేలు కలగాలంటే తగ్గించాల్సింది మద్యం ధరలను కాదు.. నిత్యవసర సరుకుల ధరలను వ్యవసాయనికి సంబంధించినటువంటి ఎరువుల ధరలను తగ్గిస్తే రైతు మేలు పొందుతారు. కానీ మధ్యం ధరను తగ్గిస్తే మేలు పొందేది సాధారణ జనమే అని చాలామంది అనుకుంటారు. కానీ ధరలు తగ్గించడం వల్ల ఆ ఎఫెక్ట్ మొత్తం మందు బాబులపై పడుతుందనేది గమనించడం లేదు. మరి ధరల తగ్గింపు మందుబాబులకు కిక్కిస్తుందా? కక్కిస్తుందా? అనే వివరాలు చూద్దాం..
తగ్గింపు మేలు ఎవరికి?
చంద్రన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మందుబాబులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మద్యం పాలసీ అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ న్యూస్ ఎప్పుడైతే ప్రభుత్వం రిలీజ్ చేసిందో అప్పటినుంచి మందుబాబుల కళ్ళల్లో ఆనందం చూడలేకపోతున్నారు. ఇన్నాళ్లు క్వార్టర్ తాగాలంటే ఒళ్ళు గుల్ల చేసుకొని పనిచేసినా తాగలేకపోయేవారు. ఎందుకంటే మద్యం రేట్లు ఆ విధంగా ఉండేవి. కానీ నూతన మద్యం పాలసీ వల్ల కేవలం 99 రూపాయలకే క్వార్టర్ ధర అది కూడా నాణ్యమైన మద్యం అందించడంతో మందు బాబులకు మరింత ఆనందం కలుగుతుందట. దీంతో రెట్టించిన ఉత్సాహం కొద్ది క్వాటర్ తాగే దగ్గర ఆఫ్ తాగుతామని మందు బాబులు చాలా ఆనంద పడిపోతున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3736 మద్యం షాపులు ఉన్నాయి. ఇందులో గీతా కార్మికులకు 340 షాపులు కేటాయిస్తారట. ఈ నూతన మధ్య విధానం రెండేళ్లపాటు కొనసాగుతుంది. దీంతో లిక్కర్ షాపులు ఉదయం పదిగంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచవచ్చు.
కిక్కిస్తుందా కక్కిస్తుందా?
ప్రతి పేదవాడు వ్యవసాయ పనులు చేసేవారు తప్పనిసరిగా పగలంతా పనిచేసి రాత్రి సమయంలో తప్పకుండా కొంత మందు తాగుతాడు. జగన్ ప్రభుత్వంలో ఆ మద్యం ధరలు ఈ పేద వాళ్లకు అందుబాటు ధరలో లేకపోవడంతో కాస్త మద్యానికి దూరమైపోయి కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి తాగడం, ఒక బాటిల్ కొనుక్కొని దాన్ని కొన్నాళ్లపాటు రోజుకు ఒక ఎగ్ రెండు పెగ్గుల చొప్పున మైంటైన్ చేస్తూ వచ్చేవారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నూతన మద్యం పాలసీ వల్ల ధరలు తగ్గుతున్నాయి. దీనివల్ల కొంతమంది పేద మధ్యతరగతి వారికి మేలు కలిగినా కానీ, ఒక క్వార్టర్ తాగేవారు, క్వాటర్ కి ఎక్కువ తాగాలనుకుంటారు. ఎందుకంటే మద్యం మత్తులో ధర తక్కువ కాబట్టి ఎంత తాగినా వారికి పెద్దగా ఎఫెక్ట్ అనిపించదు. దీంతో ఈ కొత్త పాలసీ మందు బాబులకు కిక్కిచ్చినా కానీ చివరికి కక్కేలా చేస్తుందని కొంతమంది సీనియర్ విశ్లేషకులు అంటున్నారు.