ఈ రోజుల్లో ఏటీఎంకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం పరిపాటిగా మారింది. అవును, ఒకప్పటిలా ఇపుడు బ్యాంకుల్లో టోకెన్ తీసుకొని క్యూలో నిలుచోవలసిన పనిలేదు. ఏటీఎం సర్వీసెస్ వచ్చిన తరువాత డబ్బులు డ్రా చేయడం చాలా తేలిక అయిపోయింది. అయితే కొన్ని సార్లు మనలో కొంతమంది అలా ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసిన తరువాత చిరిగిన నోట్లు కనబడడంతో కంగారు పడిపోతుంటారు. అయితే అలా భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఈ నోట్లను మీరు మార్చుకోవచ్చు. అయితే దానికి కొన్ని పద్ధతులు ఫాలో కావాలి అంతే.
పొరపాటున చినిగిన నోట్లు బయటకు వచ్చినపుడు ఆర్‌బీఐ నిబంధనలు ప్రకారం, సదరు బ్యాంకుకు వెళ్లి ఈ నోట్లను తేలికగా మార్చుకోవచ్చు. అదే విధంగా నోట్లను మార్చడానికి మరే ఇతర బ్యాంకు కూడా నిరాకరించదు.. కానీ, నోట్‌ని ఏ బ్యాంక్ ఏటీఎం నుండి తీసుకున్నారో ఆ బ్యాంకుకు తీసుకు వెళితే పని తొందరగా అవుతుంది. మీరు బ్యాంకుకు వెళ్లిన వెంటనే అడిగితే ఫారం ఇస్తారు. ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి నింపితే సరిపోతుంది. ఈ ఫారమ్‌లో నోట్‌ను జారీ చేసిన తేదీ, సమయం వంటి చిన్న సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుతో పాటు, రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి వెళ్లి కూడా సదరు నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఇందులో ఓ పరిమితి ఉంది. దీనికి సంబంధించి ఒక వ్యక్తి ఒకేసారి 20 కంటే ఎక్కువ చిరిగిన నోట్లను మార్చుకోలేరు.
అలాగే ఈ 20 నోట్ల పరిధి విలువ రూ. 5000 కంటే ఎక్కువ ఉండకూడదు అని తెలుసుకోవాలి. దీనితో పాటు ఆర్‌బిఐ చెడ్డ నోట్లును కూడా స్వీకరిస్తుంది. అంటే బాగా లేని నోట్లు. అవును, ఆర్‌బిఐ కింద కొన్ని నోట్లను చెడ్డవి అని పిలుస్తారు. అవి నిరంతర వినియోగం కారణంగా నలిగిపోయి, మరకలు పడి పాడై ఉంటాయి. ఇది కాకుండా 2 ముక్కలుగా అయిన నోట్లు కూడా ఈ లిస్టులో ఉంటాయి. నోట్‌లో రాసిన ఏదైనా సమాచారం తప్పుగా లేదా అసంపూర్ణంగా ముద్రించడం కూడా దీని కిందకు వస్తుంది అని తెలుసుకోండి. మీరు ఈ నోట్లను బ్యాంక్ లేదా bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా శాఖలో మార్చుకోవచ్చు. కాబట్టి మీ వద్ద చినిగిన, లేదా నలిగిన నోట్లు ఉంటే గాబరా పడిపోకండి!