ఆ మూగురు రాజకీయ నేతలు చెబుతున్న మాట ఏదైనా కావొచ్చు – “మా స్నేహం రాజకీయాలకు అతీతం”. కానీ ప్రజలు చూస్తున్న కోణం మాత్రం వేరే. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది వంగవీటి రాధా ఇంటి బారసాల వేడుక. అక్కడ హాజరైన వారు, తిన్న కబుర్లు, కుర్చీ కూర్చుని సాగిన సంభాషణలు అన్నీ వైరల్ అవుతుండటంతో ఇది కేవలం ఫ్యామిలీ ఫంక్షన్ కాదు, వెనుక రాజకీయకోన‌మ‌? అనే చర్చ ఊపందుకుంది. వంగవీటి రాధాకృష్ణ కుటుంబంలో ఇటీవలే పాప జన్మించగా, బారసాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆశ్చర్యకరంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని, పాత మిత్రుడు వల్లభనేని వంశీ అక్కడికి హాజరయ్యారు. ఊయలలో పాపను చూసి అందరూ మురిసిపోవడం, కలిసి కబుర్లు చెబుతూ ఆప్యాయంగా కనిపించడం అంతా కెమెరాల్లో పడిపోయింది.
 

రాజకీయంగా ఈ ముగ్గురు నెత్తిన రక్తం ఒత్తిన మిత్రులే అయినా కూడా, ఇప్పుడు మళ్లీ కలవడం వెనుక ‘రియూనియన్ – లేదా రీఎంట్రీ?’ అన్న సందేహాన్ని కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ పదవుల విషయంలో నిరుత్సాహానికి లోనవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో ఒకటి రాదాకృష్ణకు వస్తుందని అనుకుందాం. కానీ ఇప్పటిదాకా ఒక్క పదవీ రాలేదు. ఆయన అనుచరులు, అభిమానులు దీన్ని అసహనంగా తీసుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పదవులకు దూరంగా ఉన్న రాధాకు ఈసారి కూడా దక్కకపోవడం వల్ల ఆయన మౌనం వెనక ఏదో ఉందా? అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇంతలోనే బారసాల ఫంక్షన్‌లో వైసీపీ నేతల సందర్శనం దుమారం రేపుతోంది. కొడాలి నాని, వంశీ ఇద్దరూ వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన తర్వాతే రాధా ఇంటికి వెళ్లినట్టు వార్తలు రావడంతో ప్రచారం మరింత బలపడింది.

 

అసలు, రాధా వైసీపీ వైపు వెళ్లే అవకాశాలపై గతంలో నుంచే ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వర్గంలో అసంతృప్తి ఉందన్న వార్తల మధ్య ఈ కలయిక చోటు చేసుకోవడంతో ప్రచారం ఉధృతమైంది. 2027లో ఎమ్మెల్సీ, మంత్రి అవకాశాలు రాధాకు టీడీపీ తరపున ఉండొచ్చని సమాచారం. అయితే ఇప్పుడే తొందరపడి పార్టీ మారితే పొలిటికల్ లాస్ అవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు నాయకులు చెబుతున్న మాట – “ఇది కేవలం ఫ్యామిలీ ఫంక్షన్” అనే నన్నా, ప్రజల దృష్టిలో మాత్రం ఇది రాజకీయ ఫంక్షన్ లానే కనిపిస్తోంది.మొత్తానికి వంగవీటి ఇంటివాటిలో మిత్రుల కలయిక, ఏపీ రాజకీయాల్లో కొత్త ఎత్తుగడలకు సంకేతమా? లేక నిజంగానే అది స్నేహానికి మాత్రమే ఓ సందడా? కాలమే సమాధానం చెప్పాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: