జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచార హోరు సాగుతోంది.. కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీలు తమదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు వెళ్తున్నారు.. అలాంటి ఈ సమయంలో కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా మేమే జెండా ఎగరవేస్తామంటుంది.. ఇక ఈ రెండు కాదు బిజెపి పార్టీ గెలుస్తుందని వారు ఆశాభావం  వ్యక్తం చేస్తున్నారు.. ఇలా నడుస్తున్న సమయంలో చాలా సర్వేలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని  చెబుతున్నాయి..ఈ విధంగా ఎవరు గెలుస్తారు అనేది  చాలా ఆసక్తికరంగా మారింది.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన లైఫ్  మారిపోతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. మరి నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ లో గెలిచిన తర్వాత అంత ప్రియారిటీ ఎందుకు ఇస్తారు? ఆ వివరాలు చూద్దాం.. 

నవీన్ యాదవ్ ఇప్పటికే జూబ్లీహిల్స్ లో రెండుసార్లు ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు కాబట్టి ఎంఐఎం ఓట్లు నవీన్ యాదవ్ కి పడే అవకాశం ఉంది.. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే మాత్రం తప్పకుండా ఆయన రాబోవు హైదరాబాద్ ప్రతి ఎన్నికలో కీలక వ్యక్తిగా మారుతారు.. ఎందుకంటే నవీన్ యాదవ్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. కాబట్టి హైదరాబాదులో ఏ ఎన్నిక జరిగినా ఆయనను ముందు పెట్టి కాంగ్రెస్ వెనుక నుంచి ప్లాన్ నడిపిస్తుంది.. హైదరాబాదులో కాంగ్రెస్ కు ఎక్కువ పట్టలేదు..

 జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్ నే ముందు పెట్టి  యూత్ ని అట్రాక్ట్ చేసి గెలుపు బాటలను సుగమం చేసుకుంటుంది.. ప్రస్తుతం హైదరాబాద్ కు సంబంధించి వేరే నియోజకవర్గానికి చెందిన మంత్రులు ఇన్చార్జులుగా   ఉన్నారు.. నవీన్ యాదవ్ విజయం సాధిస్తే మాత్రం ఆయనకే హైదరాబాద్ బాధ్యతలు అప్పజెప్పుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. మరి కాంగ్రెస్ భావిస్తున్నట్టు నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ లో ఉంటుందా?లేదా అనేది మరికొన్ని రోజుల్లోనే బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: