ఇలా కాంగ్రెస్‌ను ఎక్కువగా ప్రస్తావించడం వల్ల అనుకోకుండా ఆ పార్టీ పేరే ఎక్కువగా ప్రజల్లో వినిపిస్తోంది. దీంతో ప్రచారంలో కాంగ్రెస్ సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ అవుతోంది. కాంగ్రెస్ వైపు చూస్తే, వారు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పేరు తగ్గించారు. తమ పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ “మళ్లీ కాంగ్రెస్‌కే ఓటు వేయండి” అనే పాజిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. జూబ్లిహిల్స్ పూర్తిగా అర్బన్ నియోజకవర్గం కావడంతో అక్కడి ఓటర్లు అభివృద్ధి, సౌకర్యాలు, జీవన ప్రమాణాల మీదే ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశలోనే ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి స్వయంగా చివరి రెండు రోజులు రోడ్‌షోలు నిర్వహించి ప్రజలతో నేరుగా కలవాలని యోచిస్తున్నారు.
బీజేపీ కూడా ప్రచారాన్ని వేగంగా కొనసాగిస్తోంది. అయితే ఆ పార్టీ ప్రచారం ప్రధానంగా హిందూత్వ అజెండాపైనే నడుస్తోంది. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ప్రచారం దూకుడుగా సాగుతున్నా, ఆయన వ్యాఖ్యల వల్ల ముస్లిం ఓటర్లు మరింత ఏకీకృతమవుతున్నారని అంచనా. ఫలితంగా బీజేపీ వ్యూహం పరోక్షంగా కాంగ్రెస్‌కే లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్‌పై వ్యతిరేకతను పెంచడానికి ప్రయత్నిస్తుండగా, బీజేపీ తన హిందూత్వ అజెండాను మైలేజ్ కోసం వినియోగిస్తోంది. కానీ ఈ రెండు పార్టీల దాడులు, విమర్శలు చివరికి కాంగ్రెస్‌కే అనుకూలంగా మారే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అందుకే కాంగ్రెస్ నాయకులు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కొంత ధీమాతోనే కనిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి