గ్రేటర్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ వో కర్ణన్ తెలిపారు. యూసఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని డిఆర్సి సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. మొత్తం 47 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు లెక్కింపు జరుగుతుంది. మొత్తం ఈ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో ప్రత్యేక అనుమతి తీసుకుని ఓట్ల లెక్కింపునకు 42 టేబుల్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొత్తం పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారు. కౌంటింగ్ కోసం 186 మంది సిబ్బందిని కేటాయించారు.
ఫలితాలను ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అలాగే మీడియాకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఫలితాలను వెల్లడిస్తాం అని కర్ణన్ చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని నగర జాయింట్ సీపీ తప్సీమ్ ఇక్బాల్ తెలిపారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని .. అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లి నట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి