విపక్ష వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న "సిట్‌" అధికారులతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ ఎయిర్‌పోర్టులో సమావేశం అయ్యర్ఫని తెలుస్తుంది. ఈ కేసును విచారిస్తున్న ఇద్దరు ముఖ్య అధికారులు సైతం ఒకటి రెండు రోజుల క్రితం అమరావతి వెళ్లి ముఖ్య మంత్రి  చంద్రబాబు తో భేటీ అయ్యారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఉందని శంకిస్తున్న కుట్ర కోణం వెలుగు లోకి రాకుండా ప్రభుట్వంలోని పెద్దలు విచారణ అధికారులపై వత్తిడి చేస్తున్నారని, సాక్ష్యాలను మసిబూసి మారేడుకాయ చేయటానికి తగినన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ముందస్తు నిర్ధారణ ప్రకారం విచారణ మాత్రమే కొనసాగుతోందనే విమర్శలకు ఇది బలం చేకూరుస్తోంది. 
murder attempt on jagan case investgation process కోసం చిత్ర ఫలితం
విపక్షనేతపై పలుసందర్భాల్లో ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న అసహనం, అమానవీయ వైఖరి, కక్షకార్పణ్యాల బహుముఖ ప్రదర్శన, విచారణకు ముందుకు ముందే డిజిపి వెల్లడించిన అభిప్రాయం, ముఖ్యమంత్రి అనాలోచితంగా ప్రెస్-మీటులో స్వయంగా వెల్లడించిన విషయాలు కూడా ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. 
SIT on Jagan case Visakha కోసం చిత్ర ఫలితం
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారిస్తున్న తరుణంలో, అసాధారణ రీతిలో, స్పెషల్  ఇన్వెస్టిగేషన్ టీం - సిట్ అధికారు లతో ముఖ్యమంత్రి సమావేశం కావడం, సాధారణ న్యాయసూత్రాలకు విరుద్దమని ఆయన ప్రవర్తన కేసు విచారణను ప్రభావితం చేస్తుందనటంలో, ఎలాంటి  అనుమానం లేదని పరిశీలకులు, న్యాయనిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఫ్యూజన్ హోటల్ అధినేత హర్షవర్ధన్ ను సరిగా విచారణ చేయకపోవటం లోని చీకటి కోణం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.
chandrababu on jagan murder attempt case కోసం చిత్ర ఫలితం
ముఖ్యమంత్రి సిట్ అధికారులతో మీటింగ్ అనేక అనుమానాలు రెకెత్తిస్తూ, తీవ్రచర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి అధికారుల పనిపరిధిలోకి ప్రవేశించటం, విచారణను ప్రశ్నించటం వివరాలు తెలుసుకోవటం, ఆదేశాలివ్వటం జరిగిందంటే నేపధ్యంలో ప్రతిపక్షనేత పై హత్యాయత్నంలో "రాజ్య హింస" పాత్ర లేదనుకోలేము. 
శ్రీకాకుళం పర్యటన కోసం సోమవారం మధ్యాహ్నం 12.50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడే జగన్‌పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న సిట్‌ అధికారులతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. సీఎం వచ్చే సమయానికి సిట్‌ అధికారులు విమానాశ్రయం వద్ద సిద్ధంగా ఉండాలని సీఎంవో నుంచి ఉదయమే విశాఖ పోలీసులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. 
murder attempt on jagan case investgation process కోసం చిత్ర ఫలితం
ఈ నేపథ్యంలో సిట్‌ కార్యాలయంలో విచారణ అధికారి "ఏసీపీ నాగేశ్వరరావు" వద్దకు వచ్చిన సీఎంవో అధికారి ఒకరు, సీఎం గారు వస్తున్నారు. వెంటనే ఎయిర్‌పోర్టు కు రావాలని సార్‌! చెప్పారు. అని చెప్పడంతో, ఆయన సిబ్బందితో కలసి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. సిట్‌ విచారణను పర్యవేక్షిస్తున్న డీసీపీ నయీం కూడా అంతకు ముందే విమానాశ్రయానికి బయలుదేరారు. విశాఖ సీపీ మహేష్‌చంద్ర లడ్హా, డీసీపీ నయీం, సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ నాగేశ్వరరావు ఇతర అధికారు లు విమానాశ్రయం వద్ద కాసేపు విచారణ ప్రక్రియపై సమీక్షించారు. అనంతరం సీపీ మహేష్‌చంద్ర లడ్హా, డీసీపీ నయీం విమానాశ్రయం లోపలికి వెళ్లారు. సీపీ, డీసీపీలతో సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యా యత్నం కేసు విచారణ సాగుతున్న తీరుపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
chandrababu meets SIT on jagan case కోసం చిత్ర ఫలితం
ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరపైకి రాకుండా చూడాలని సూచించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితుడి కాల్‌డేటా లో ఉన్న ఫోన్‌ నంబర్ల ఆధారంగా సాక్షుల విచారణ పేరుతో దర్యాప్తును సాగదీయాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సాగుతోందని పోలీసువర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖలో ఈ కేసు బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక పోలీస్‌ ఉన్నతాధికారి,  కిందిస్థాయి అధికారితో కలసి రహస్యంగా విజయవాడ వెళ్లి సీఎంను కలిసిన విషయం నిన్న అలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుని విచారించడంలో ఆ ఉన్నతాధికారితో పాటు కిందిస్థాయి అధికారే కీలకంగా వ్యవహరించారు. అనంతరం వ్యక్తిగత పనుల మీద సెలవుపై వెళ్లిన ఆ ఉన్నతాధికారి ఒకటి రెండు రోజుల క్రితం విజయవాడ వెళ్లారు. కేసు విచారణలో కీలకంగా ఉన్న పోలీస్‌-స్టేషన్‌ స్థాయి అధికారి కూడా విశాఖ నుంచి అక్కడకు చేరుకున్నారు.
SIT on Jagan case Visakha కోసం చిత్ర ఫలితం
అనంతరం ఆ ఇద్దరు అధికారులు సీఎంతో భేటీ అయ్యారని, ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అధికారులు రహస్యంగా విజయవాడ వెళ్లాల్సిన అవసరం ఏమిట న్నది చర్చనీయాంశంగా మారింది. ఒక్క రోజులోనే సీఎం విమానాశ్రయంలో మరోసారి పోలీసు అధికారులతో సమావేశం కావడం అసాధారణమని, చూట్టానికి ఈ విచారణ అంతా స్వయంగా ముఖ్యమంత్రే చేస్తున్నట్లుగా ఉందని అధికారవర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నారట. 
SIT on Jagan case Visakha కోసం చిత్ర ఫలితం
ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న సిట్‌ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కావడంపై ప్రజల్లోను, ప్రతిపక్షా ల్లోను, కొందరు పోలీసు అధికారుల్లోను తీవ్ర విమర్శలు పడిపోతున్నాయి. ప్రభుత్వ, పార్టీ అధినేతల కనుసన్నలలోనే ఈ హత్యాయత్నం కుట్ర  జరిగిందన్న ఆరోపణల నేపద్యంలో, సీఎం అవాంఛనీయ పద్దతి లో కేసు విచారణ అధికారులను కలుసుకోవటం అంటే కేసు విచారణలో జోక్యం చేసుకుంటున్నట్లేనని ఒక రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు. 
SIT on Jagan case Visakha కోసం చిత్ర ఫలితం
హత్యాయత్నం జరిగిన పదిరోజుల తరువాత కూడా పాత్రధారిని తప్ప అసలు సూత్రధారుల్లో ఏఒక్కరి పాత్రను కూడా పోలీసులు చేదించలేకపోవటానికి కారణం వారి అసమర్ధత కాదని, ఈ కేసులో నెలకొన్న విపరీత రాజకీయజోక్యమేనని విశ్లేషకుల భావన.  ఇదంతా కేసు విచారణపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో కుట్రకోణాన్ని, సూత్రధారుల పాత్రను బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో సర్ఫ్వత్రా వ్యక్తమవుతున్నాయి.

SIT on Jagan case Visakha కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: