2019 శాసన సభ, సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరభవ పాలైంది తెలుగుదేశం. అయితే బుధవారం జరగనున్న శాసన సభ సమావేశాలపై ఏలాంటి  అంశాలు, నిర్ణయాలు తీసుకోవాలన్న సమావేశంలో పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన కుటుంబ పెత్తనానికి మాత్రం చెల్లుచీటి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా మంగళవారం ఆయన అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం శాసనసభా పక్ష (టీడీపీఎల్పీ) భేటీనే నిదర్శనంగా చెప్పాలి.  శాసనసభాపక్ష భేటీ అంటే ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచి నిలిచిన వారు మాత్రమే కాకుండా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేతకు మాత్రం మినహాయింపు ఉంటుంది.

అయితే టీడీపీలో ఇలాంటి వాటికి పెద్దగా పట్టింపు లేదనే చెప్పాలి. ఎందుకంటే... టీడీఎల్పీ భేటీకి ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేశ్ హాజరయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన లోకేశ్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో చిత్తుగా ఓడారు. ఓటమి నేపథ్యంలో ఏమాత్రం బయటకు రాకుండా గడుపుతున్న లోకేశ్... టీడీఎల్పీ భేటీకి మాత్రం హాజరయ్యారు. సరే... ఎలాగూ ఎమ్మెల్సీ హోదాలో లోకేశ్ టీడీఎల్పీ భేటీకి హాజరయ్యానుకుంటే... ఆ భేటీలో లోకేశ్ మినహా ఒక్క ఎమ్మెల్సీ కూడా కనిపించలేదు.

అంటే... పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలోనే లోకేశ్ ఈ బేటీకి హాజరయ్యారా? అంటే... అలా చట్టంలో లేదు కదా. కేవలం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేత అసెంబ్లీలో సభ్యుడిగా లేకున్నా కూడా శాసనసభాపక్ష భేటీలకు హాజరు కావచ్చు. ప్రధాన కార్యదర్శులకు - జాతీయ ప్రధాన కార్యదర్శులకు అందులోకి అనుమతి లేదు. మరి లోకేశ్ కు అవేమీ పట్టవో - లేదంటే... పార్టీ మన కుటుంబానిదే కదా.. వచ్చేస్తే ఏమవుతుందనుకున్నారో తెలియదు గానీ... టీడీఎల్పీ భేటీకి వచ్చేసిన లోకేశ్... ఏకంగా ముందు వరుసలో కూర్చుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: