అధికారంలో ఉన్నప్పటి మన తీరు మన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే అంటారు, “అధికారాంతమందు చూడవలె అయ్యగారి సౌభాగ్యముల్…” అని  చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతిపక్షం వైసిపి పట్ల, కేంద్రంలోని బిజేపి పట్ల, పొరుగు రాష్ట్రం తెలంగాణా పట్ల రాజకీయ సరిహద్దులే కాదు, సాంప్రదాయ సరి హద్దులు దాటితే అధికారం అత్యవసరం అవుతుంది. ఇపుడు తెలుగు రాష్టాల పరిస్థితి ఇలాగే ఉంది. పూర్వం ప్రతిపక్షపార్టీలలో ఎంతో కొంత ధైర్యం కనిపించేది. దూకుడుగా అధికార పార్టీ మీద దాడిచేసేవారు. పవర్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనే ఆవేదన తప్ప మిగతా బాధలు ప్రతిపక్షానికి ఉండేవి కావు. కానీ రోజులు మారి పోయాయి. 


బతికి బట్ట కట్టాలంటే అధికారంలో ఉండి తీరాలి అని ప్రతి పార్టీ భావిస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉంటే మనపని అయిపోయి నట్టే అని భావిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రలోని అన్ని ప్రతిపక్ష పార్టీలదీ ఇదే తీరు, పరిస్థితి కూడాను.  రాజకీయం హద్దులు దాటి వ్యక్తిగత కక్షల దాకా వెళ్లడం వల్లే ఈ సమస్య. ఏపీలో తెలుగుదేశం, తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇదే. 
Image result for modi jagan chandrababu sandwiched
ఇక ఏపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి అయితే “నానాటికి తీసికట్టు నాగం బొట్లు” అనే సామెతలా – ఆయ్న పరిష్తితి దేశ వ్యాప్త రాజకీయాల్లో దిగజారి పోగా – కార్యకర్తలు ఆయనకు ధైర్య వచనాలు పలకటం – అంతకు మించి ఆ వార్తలు తన స్వంత అనుకునే మీడియాలో గొప్పగా రాస్తుంటే పాఠకులు చెసే అవమానం మరింత ఇబ్బందికరం. 


పార్టీ అధినేత ఆయన. ఇంతకాలం అధికారంలో ఉన్నపుడు తెలుగుదేశం నేతలు వ్యవహరించిన తీరువల్ల ఇపుడు ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి అధినేత వైఎస్ జగన్ తో, అటు కేంద్రంలో విజయదుందుభులు మ్రోగిస్తూ మళ్ళా అధికారంలోకి వచ్చిన బీజేపీతో ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కొక్క నాయకుడు పార్టీ మారడానికి చూస్తున్నారని సమాచారం. వ్యాపార ప్రయోజనాలు కావచ్చు, రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు, వారసుల పరిరక్షణ కోసం కావచ్చు. నెలరోజుల్లోపు ఐదారు మంది తెలుగుదేశం నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరాలని తపిస్తున్నారు. 
Image result for modi jagan chandrababu sandwiched
వీరిలో మొదటి వరుసలో ఉన్నది జేసీ దివాకర్ రెడ్డి. వ్యాపారపరంగా, రాజకీయపరంగా క్షేమంగా ఉండాలి అంటే ఆయనకు కేంద్రం అండ కావాలనేది జేసీ ఆలోచన. పైగా బీజేపీ కూడా ఉద్దేశపూర్వకంగా తనపార్టీని బలపరుచు కోవడానికి అధికార వ్యవస్థలను రాజకీయ ప్రయోజనా కోసం వాడుకుంటోంది. ఇక కొద్ది రోజులుగా టిడిపి విజయవాడ ఎంపి టిడిపిలోని అంతర్గత శతృత్వం నుండి బయట పడాలని చూస్తున్న కేశినేని నాని కూడా అనుమానాస్పదంగా వ్యవవహరిస్తున్నారు. బీజేపీ వైపు చూస్తున్నారని సమా చారం. ఇలా పలువురు తెలుగుదేశం నేతలను రాష్ట్రంలో మిత్రుడు అయిన వైఎస్ జగన్ ను వాడుకుని, కేంద్రంలో తన పవర్ వాడుకుని భయపెట్టి తన పార్టీలో చేర్చు కోవడానికి బీజేపీ పరోక్షంగా ప్రయత్నం చేస్తుంది. 


రాష్ట్రంలో బిజేపి వెళ్ళూనటానికిది దగ్గరిదారి. ఏన్నికల ముందువరకు ప్రధాని నరేంద్ర మోడీని , అధికార బీజేపిని నాలుగేళ్లూ ఫుల్లుగా వాడేసుకొని చివరి సంవత్సరం  ఎన్డీఏ నుండి బయటపడి వారి అంతానికి ప్రయత్నించిన చంద్రబాబు తీరు గర్హనీయమని సఖల భారత ప్రజలకు తేటతెల్లం అయింది. ఇతర పార్టీల వారిని ఆకర్షించడం రాజకీయంగా తప్పేం కాదు గాని, అందుకోసం చంద్రబాబు అవలంబించిన తప్పుడు విధానమే  నేడు బీజేపి అవలంభించబోవటంతో మొర పెట్టుకోవటానికి ప్రపంచంలో తన దిక్కుచూసే వారెవరూ చంద్రబాబుకు మిగలలేదు. 


మా పార్టీలోకి మీరు వస్తారా? లేకపోతే మా చర్యలతో మీరు చస్తారా? అని నాడు చంద్రబాబు వైసిపి ఎమెల్యేలను ఎంపీలను  బెదిరించినట్లే నేడు పగ తీర్చుకోవటానికి బీజేపి ప్రయత్నించవచ్చు. ఇలా కోరి తెచ్చుకునే చేరికల వల్ల ఏ పార్టీ ఎంతకాలం నిలదొక్కుకోగలదో? ఇప్పుడు టిడిపి ని చూస్తే తెలుస్తూనే ఉంది. రాజకీయ నేత మనస్ఫూర్తి గా నమ్మి మనతో చేరితేనే మన పార్టీకి ఉపయోగం. లేకపోతే మళ్లీ మళ్లీ అధికారం ఎవరి చేతిలో ఉంటే వారి పంచన చేరతాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీలో చేరితే, రానున్న ఐదేళ్లు పూర్తిగా సురక్షితం అందుకే బిజేపి లోకి గోడ దూకటానికి ప్రతిపక్షం చూస్తుంది. 
Image result for chandrababu kcr jagan modi
భవిష్యత్తు సంగతి పక్కన పెడితే,  కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలపై తమ నాయకుల నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవడానికి చంద్ర బాబు ఆపసోపాలు పడే పరిస్థితి. ఆయన గత సంవత్సరం నడవడికతోనే తెచ్చుకున్న స్వయంకృతం. ఇటు రాష్ట్రంలో బాబు చేత నష్టపోయిన వైసీపి అత్యంత ఆధిఖ్యతతో బలమైన యువ నాయకత్వంతో అధికారం లోకి వచ్చింది. కేంద్ర సంగతి సరేసరి దాంతో తానే సున్నం పెట్టుకున్నాడు. 


అందుకే రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు ఇది చాలా “టఫ్-టైం” అనేకంటే ఆయనను కాలమే పూర్తిగా కాలసర్పమై కాటేయనుంది. ఇపుడు కనుక వీటిని అధిగమించి నిలదొక్కుకుంటే పార్టీ నిలబడుతుంది. లేదంటే, మరింత బలహీనపడి పతనదిశలో పయనించి అంతర్ధానం అవకతప్పదు. వయసు ముదురుతున్న బాబు, రాజకీయ నిష్ప్రయోజకుడుగా ఇప్పటికే ఋజువైన చినబాబు – బలమైన వైఎస్ జగన్ ను ఏమీ చేయలేరు.  బీజేపీ ఆకర్ష్ ను, వైసీపీ ప్రజావిజయంతో వచ్చిన ఆత్మ విశ్వాసం చేసే రాజకీయం (బాబు దీన్ని అణచివేత అనవచ్చు) చంద్రబాబు ఎలా ఎదుర్కోబోతున్నారు? అనేది తెలుగుదేశం కనీస సమీప భవిష్యత్తును నిర్ణయించబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: