ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించారు.  ఇటీవల తన కేబినెట్ మీటింగ్ లో ఐదుగురు డిప్యూటీ స్పీకర్లను నియమించుకున్నారు.  ప్రస్తుతం తనకు నమ్మకముండి..తనతో పాటు ప్రయాణం కొనసాగిస్తున్నా నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు.  నిన్న అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన వారు ఏపి అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

సీఎం జగన్ మోహన్ రెడ్డి  తనను స్పీకర్ గా ఎన్నకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో శాసనసభలో పెద్దలు విశిష్ట సాంప్రదాయాలు నెలకొల్పారని, వ్యవస్థల పట్ల ప్రజల నమ్మకం పోతే, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని అన్నారు. 


తన నిర్ణయాలు కోర్టులు సమీక్షించాల్సిన పరిస్థితి ఏనాడూ రాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. సభా గౌరవంపై శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నా మని, తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. 
అనంతరం, రేపు ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభను వాయిదా వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: