దివంగత ఏపి ముఖ్యమంత్రి వైఎస్ రాజశెఖరరెడ్డి జీవితకాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి వేరే పార్టీకి మారింది లేదు. ఆయన కాంగ్రెస్ వాదిగా రాజకీయాల్లో ప్రవేశించారు కాంగ్రెస్ వాదిగానే కొనసాగారు కాంగ్రెస్ వాదిగానే దివంగతులయ్యారు. ఈ రోజు ఏపి శాసనసభలో పార్టీ ఫిరాయింపులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షనేత నారాచంద్రబాబు నాయుడు స్పందన ఇలా ఉంది:


"సీఎం ప్రసంగం ప్రతిపక్షాన్ని కించపరిచేలా ఉంది. 1978 లో రెడ్డి కాంగ్రెస్‌ నుంచి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు పార్టీ మారలేదా? గెలిచిన నాలుగు రోజుల్లో నే పార్టీ మారారు. అప్పట్లో బాట్టం శ్రీరామ్మూర్తి గారు మీకంటే ఎక్కువ ఘాటుగా విమర్శించారు. ఆ చరిత్రను ఒకసారి చూసుకోండి. తండ్రికి వారసులుగా చెప్పుకుంటున్న వారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకోవాలి.... " అని చంద్రబాబు వివరించారు.


అబద్ధాలు చంద్రబాబు చరిత్ర వక్రీకరణ ముగ్గురు ఏక గర్భ సంజాతలు (కవలపిల్లల-లాగా-.ముగ్గురు) చరిత్ర వక్రీకరించటం ఆయన నైజం. ఆయనకు డెబ్బైయేళ్ళ వయసు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నంత మాత్రాన మాటలు నిజమను కోవాలా?  తాను డెబ్బై యేళ్ళ వయసున్నంత మాత్రాన చరిత్ర ఙ్జానం ఆయనకే ఉందను కోవటం తప్పు. ఆయన "కాలరేఖ" ఒక సారి పరిశీలిద్ధాం. ఒకవేళ చరిత్ర తప్పంటే మనం చేయగలిగేది ఏమీ ఉండదు.  


వైఎసార్ అలంకరించిన పదవులు

1975: యవజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం.
1980: తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా నియామకం.
1982: రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖా మంత్రి పదవి లభించింది.
1982: రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం.
1983: పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు (1985 వరకు).
1998: రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం (2000 వరకు).
1999: శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు.
2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.

వైఎసార్ సాధించిన విజయాలు

1978: పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినాడు.
1983: పులివెందుల నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా విజయం.
1985: పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హాట్రిక్ విజయం.
1989: కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లొకసభ సభ్యుడిగా విజయం.
1991: కడప నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపు.
1996: కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించాడు.
1998: కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించాడు.
1999: పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు.
2004: పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయసాధించాడు.
2009: పులివెందుల నుంచి రెండోసారి హాట్రిక్ విజయం, శాసనసభ్యుడిగా గెలుపొందడం ఆరవసారి.


వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకున్న రాజకీయ పరిఙ్జానం ప్రకారం ఒక్కసారి కూడా భారత జాతీయ కాంగ్రెస్ లేదా ఇందిరా కాంగ్రెస్ లోనే కొనసాగారు. చంద్రబాబు చెప్పింది నూరు శాతం అబద్ధం. పాపం! మధ్యలో మన మద్యలేని దివంగత బాట్టం శ్రీరామమూర్తి గారిని లాగేశారు చంద్రబాబు. 


ఒకవేళ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మార్గదర్శనంలో నడిచినా వైఎస్ జగన్మోహన రెడ్డి తన తండ్రి కంటే గొప్పవాడు గా ఉండ కూడదా? కూడదనేనా? చంద్రబాబు భావన. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: