తప్పు చేయడం మానవ సహజం. అయితే గుణపాఠాలు కూడా ఉంటాయి. వాటిని గుర్తుంచుకుంటే మళ్ళీ తప్పులు చేయరు. ఇక కళ్ళ ముందు కనిపించిన వాటిని పరిగణనలోకి తీసుకున్నా కూడా తప్పులు చేయకుండా జాగ్రత్తపడతారు.


వైసీపీ విషయానికి వస్తే స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నిక సందర్భంగా  అతి చేసినట్లుగా అనిపించింది. ముఖ్యమంత్రి జగన్ ఫిరాయింపుల గురించి సభలో ప్రస్తావిస్తూ చంద్రబాబు జమానాలో జరిగిన దాన్ని బయటకు తీశారు. ఇక మిగిలిన వాళ్ళు వూరుకుంటారా రెచ్చిపోయారు. మరో వైపు చంద్రబాబు కూడా కౌంటర్లు  ఇవ్వడంతో ఆయన పార్టీ నుంచి కూడా గట్టిగానే ప్రతి విమర్శలు వచ్చాయి. ఇవన్నీ ఇలా ఉంటే అసెంబ్లీలో చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని వైసీపీ నేతలు చాలానే చేశారన్న భావన కలుగుతోంది.


 బాబు తప్పులు చేశారు. అందుకే  ఆయన్ని జనం పక్కన పెట్టారు. ఆ సంగతిని అంతటితో వదిలేయకుండా రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇతర ఎమ్మెల్యేలు బాబును టార్గెట్ చేసుకుంటూ పోయారు. ఇలాంటి పరిస్థితే అయిదేళ్ల క్రితం జగన్ విషయంలోనూ టీడీపీ చేసింది. దానికి ఫలితం అనుభవిస్తోంది. ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పంపించింది పాత పురణాలు తిరగేసి తిట్టుకోవడానికి కాదు, 


ప్రజా సమస్యలపైన చర్చించడానికి, ఇకనైనా అధికార పక్షం బాధ్యతగా వ్యవహరించాలి. జగన్ సైతం బాబు వూసు మరచిపోయి ఎంత తక్కువగా టీడీపీ గురించి మాట్లాడితే అంత మంచిది. ఆయన సభ్యులు కూడా ఇదే విధానం అనుసరించాలి. అపుడే జనం మనసులు మరింతగా జగన్ బ్రుందం గెలుచుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: