ఎన్నికల్లో గెలుపోటములు సహజం.  ఒక పార్టీ ఓడిపోతే మరో పార్టీ గెలుస్తుంది.  గెలుపోటముల మధ్య సమీకరణాలు చాల ఉంటాయి.  ఆ పార్టీకి పూర్వం ఉన్న చరిత్రను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేస్తుంటారు.  2019 ఎన్నికల్లో వైకాపా భారీ విజయం సాధించింది.  భవిష్యత్తులో ఇలాంటి విజయం మరెవ్వరికీ సాధ్యం కాకపోవచ్చు.  

ఎన్నికల్లో కొంతమేరకు ప్రభావం చూపుతారని భావించిన పవన్.. ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయారు.  జనసేన ఓటమిపై రోజా స్పందించింది.  జనసేన పార్టీ ఓటమికి 2009 లో ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీనే కారణం అని చెప్పింది.  అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ 2009 లో పోటీ చేసి 18 సీట్లు గెలుచుకుంది.  ప్రజలు ఎంతో నమ్మకంతో 18 మందిని గెలిపిస్తే.. చిరంజీవి ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేశారు.  

ఇప్పుడు పవన్ కూడా అలా చేస్తారేమో అనే భయంతో ప్రజలు ఓటు వేయలేదు.  చాలా ప్రాంతాల్లో జనసేన పార్టీ మంచి పోటీ ఇచ్చినట్టు రోజా చెప్పింది.  పవన్ కూడా మంచి పోటీ ఇచ్చారని గెలుపోటములు సహజమే... పవన్ గెలిచి ఉంటె బాగుండేది అని చెప్పింది రోజా.  సినీ రంగంలో, రాజకీయ రంగంలో పోటీ, ఒత్తిడి అధికంగా ఉంటుంది.  

ఈ పోటీని ఒత్తిడిని తట్టుకొని, ఎదుర్కొని నిలబడిన వ్యక్తులే గెలుస్తారు అని చెప్పింది రోజా.  2009 ఎన్నికల్లో తనను సొంతపార్టీలోని వ్యక్తులే ఓడించేలా చేశారని రోజా ఆవేదన వ్యక్తం చేసింది.  2014ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి విజయం సాధించింది.  2019 ఎన్నికల్లో కూడా రోజా నగరి నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: