మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ చాతుర్యం ఇంతేనా అని తాజా ఎన్నికలు తేల్చేశాయి. అంతన్నాడు ఇంతన్నాడు అన్నట్లుగా వేయి శాతం మనదే విజయమని నమ్మించి మరీ కూసాలు కదిలించే ఓటమికి బాబు గారు అందించేకా తమ్ముళ్లకే ఇపుడు వుసుగు పుడుతోంది.


ఇక బాబు గారు ఏ మాత్రం మారలేదనడానికి నిన్నటి అసెంబ్లీ ఎపిసోడ్ ఓ ఉదాహరణ. బీసీ కులానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉంటే బాబు గారు ఆయన్ని కనీసం తోడ్కొని వెళ్ళేందుకు రాలేదు. సరే ఇదిలా ఉంచితే అసెంబీలో వివాదాల జోలికి పోనంటూనే చనిపోయిన వైఎస్సార్ ప్రస్తావన తీసుకువచ్చారు.


దీని మీద బాబు పై సోషల్ మీడియాలో ఓ రేంజిల కౌంటర్లు పడుతున్నయి. అదలా ఉంచితే సినీ విమర్శకుడు కత్తి మహేష్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైఎస్ ని బాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ''సపోజ్... పర్సపోజ్... చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడు కాకుంటే ఎన్టీఆర్ ప్రభంజనం తరువాత కాంగ్రెస్ లో ఓడిపోయి తిరపతికో చెన్నైకో బెంగుళూరుకో పోయి యాపారాలు చేసుకునేవోడు. కానీ రాజశేఖర్ రెడ్డి సొంతంగా రాజకీయాల్లో ఎదిగాడు. ఎక్కడికీ పోయేటోడు కాడు. ఎవరికి ఓంగేటోడు అంతకన్నా కాదు.
కాబట్టి బాబుగారు అనవసరంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి తనగొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. పోగాలము దాపురించినచో...'' అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై వైసీపీ వాళ్లు మద్దతు తెలుపుతుండగా టీడీపీ సపోర్టర్స్ మాత్రం విమర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: