వినడానికి వింతగా  ఉందా. తెలుగుదేశంలో అన్న గారి బొమ్మ ఉండాలి. లేకపతే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు బొమ్మ ఉండాలి. కానీ ఇదేంటి. వేరే పార్టీకి చెందిన అధినేత ఫోటో ఏంటి. ఈ సంగతేంటి. ఈ మతలబు ఏంటి. 


అవును టీడీపీ ఆఫీసులో జగన్ ఫోటో ఉండాలట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఒకనాడు టీడీపీలో మంత్రిగా అనేక పదవులు నిర్వహించి ఇపుడు వైసీపీలో కీలకనేతగా ఉన్న దాడి వీరభద్రరావు అంటున్న మాట ఇది. అవును వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తే టీడీపీలో ఒక్క చంద్రబాబు నాయుడే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు అటువంటి పరిస్థితి లేకుండా జగన్ రక్షించినందుకు టీడీపీకి బతికించినందుకు ఆయన ఫొటోయే పార్టీ ఆఫీసులో ఉండాలని అన్నారు.


ఇదిలా ఉండగా వయసులో చిన్నవాడు అయిన జగన్ నైతిక విలువల్లో మాత్రం దేశంలోని అందరి నేతలకు ఆదర్శనీయుడు అయ్యారని అన్నారు. జగన్ చూపించిన నైతిక ప్రమాణాల మేరకు ఫిరాయింపులకు పాల్పడకుండా ప్రతీ ఒక్కరూ నిబద్ధత చాటాలని దాడి సూచించారు. ప్రజాస్వామ్యం బాగుండాలంటే జగన్ కి ఉన్న కమిట్మెంట్ అందరిలోనూ రావాలని ఆయన కోరారు.


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయాన్ని దేశంలోని అన్ని చట్టసభల్లోనూ అమలు చేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడి నైతిక విలువలను తుంగలో తొక్కిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకంటే చిన్నవాడైన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చూసి నైతిక విలువలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నైతిక విలువలు పాటిస్తే గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: