2019 ఎన్నికలు చంద్రబాబుకు కంటతడి పెట్టించే విధంగా చేశాయి. ఓడిపోతే ఓడిపోవచ్చు.. అలాగని, ఈస్థాయిలో ఓటమి ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు.  తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఎప్పుడు ఓడిపోలేదు.  ఇలానే కొనసాగితే.. నెక్స్ట్ పార్టీ పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు.  

పార్టీకి వచ్చిన దుస్థితిని చూసి కార్యకర్తలు షాక్ తిన్నారు.  నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటో అర్ధంగాక తలలు పట్టుకుంటున్నారు.  ఇదే సరైన సమయం అని బాలయ్య రంగంలోకి దిగారు.  హిందూపురంలో పార్టీ కార్యకర్తలకు, ప్రజలు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చాడు.  అవసరమైన పనులను తాను దగ్గరుండి జరిగేలా చూస్తానని అంటున్నాడు.  

ఇక మూడు రోజులపాటు విజయవాడలోనే ఉండి, చంద్రబాబును కలవడానికి వచ్చిన కార్యకర్తలకు భరోసా, ధైర్యాన్ని ఇస్తున్నారు.  అందరికి అండగా ఉంటానని హామిస్తున్నాడు.  నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన కోటంరెడ్డికి బాలయ్య స్వయంగా ఫోన్ చేసి.. భయపడాల్సిన అవసరం లేడనై భరోసా ఇచ్చాడట.  

బాలయ్య ఇలా హడావుడిగా ఎందుకు చేస్తున్నారు.   అనే డౌట్ అందరిలోను కలిగింది.  ఇంతటి హడావుడికి ఒక్కటే కారణం.. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టిడిపి గెలిస్తే.. తనకు గట్టి పదవి వస్తుందేమో అనే ఆశతోనే బాలయ్య ఇలా చేస్తున్నారని కొందరు అంటున్నారు.  అంటే.. నారా వారి చేతుల్లోనుంచి పార్టీ తిరిగి నందమూరి చేతుల్లోకి వెళ్లబోతుందనే సంకేతాలు అందుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: