2019 ఎన్నికలో వైకాపా తిరుగులేని విజయం సాధించింది.  151 స్థానాల్లో విజయం సాధించిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక అంతే దూకుడును మొదలుపెట్టింది.  వరసగా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు అండగా ఉండేందుకు సిద్ధం అవుతున్నది. ఇచ్చిన హామీలను అమలు పరిచే విషయంలో కూడా జగన్ ఇలాంటి దూకుడునే ప్రదర్శిస్తున్నారు.  
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ కావడానికి సిద్ధం అవుతుంటారు.  ఇది షరా మామూలే.  అయితే, జగన్ తన పార్టీలోకి ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్లకు అవకాశం లేదని, ఒకవేళ రావాలి అంటే ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేయాలనీ, అప్పుడే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఇప్పటికే చెప్పాడు. 
ఇదిలా ఉంటె, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు వైకాపాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.  అలా సిద్ధంగా ఉన్న వ్యక్తుల్లో 8 మంది టచ్ లో ఉన్నారని.  వారిలో ఒకరు నెంబర్  రెండు మూడు స్థానాల్లో ఉన్న వ్యక్తులు అని చెప్పడంతో టిడిపి షాక్ అవుతున్నది.  టిడిపి లో నెంబర్ 2 ఎవరు నెంబర్ 3 ఎవరు.. ఎవరు టిడిపి నుంచి వెళ్లాలని అనుకుంటున్నారు అని ఆరా తీస్తే.. 
గంటా శ్రీనివాసరావు అని కొందరు చెప్తున్నారు.  ప్రతిపక్షంలో ఉండే పార్టీతో కలిసి ఆయన ఎప్పడు పనిచేయలేదు.  అధికార పక్షంలోకి వెళ్ళడానికి అయన ప్రయత్నిస్తూనే ఉంటాడు.  ఏ పార్టీలో ఉన్నా.. ఎక్కడి నుంచి పోటీ చేసినా గంటా విజయం సాధిస్తూనే ఉన్నాడు.  ఒకవేళ గంటా పార్టీ మారాలని అనుకుంటే.. రాజీనామా చేసి వైకాపాలోకి వెళ్ళాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: