డేట్ ఇంకా తిరగలేదు. ఫేట్ మారి నెల రోజులు కూడా కాలేదు. జగన్ సీఎం గా ప్రమాణం చేసి కనీసం ఇరవై  రోజులు కూడా కాలేదు. మే 23 వరకూ నూటికి వేయి శాతం గెలుస్తామని చెప్పిన చంద్రబాబు, బుర్ర వూపి మరీ విన్న తమ్ముళ్లకు ఇపుడు కలా నిజమా అన్నట్లుంది.


జగన్ సీఎం కావడమేంటి, మనం ఇలా అయిపోవడం ఏంటి అని ఎంత గిల్లుకున్నా వారికి కలగానే ఉంది. సరే అవునన్నా కాదన్న జగన్ ఏపీకి సీఎం. అయిదేళ్ళ వరకూ ఆయన్ని ఎవరూ కదపలేరు. ఇక ప్రతిపక్షం బుద్ధిగా ప్రజా తీర్పుని అంగీకరించి హుందాగా నడచుకోవాలి. ప్రతీ రోజూ హుందా తనం గురించి తెగ లెక్చర్లు దంచే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ ఇపుడు మాత్రం ఆ హుందాతనం ప్రదర్శించలేకపోతున్నారు.


కనీసం కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుండా  ఆరు రోజులకే ఆవురావురుమంటూ టీడీపీ తమ్ముళ్ళు రోడ్ల మీదకు వచ్చేశారు. బాబు గారికి ఐర్ పోర్టులో తనిఖీలేంటి, ఆయనకు అవమానం, ఆయన ధర్మరాజు, వైసీపీ కౌరవులు ఇల్లా బుద్దా వెంకన్నలు వగైరా వగైరాలు అంతా గొంతు చించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులకు వీఐపీ హోదా ఉండదని ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీకి తెలియదా, తెలిసినా తమ్ముళ్ళు లేకిగా, వెకిలిగా రోడ్ల మీదకు వస్తూంటే వినోదం చిత్తగిస్తున్నారా.



మరింత సమాచారం తెలుసుకోండి: