రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా నేను మాత్రం వాటిని చేసి తీరుతానని ధీమాగా చెబుతున్నారు. అయితే ఏ ముఖ్యమంత్రి  తన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఇన్ని నిర్ణయాలు చేయలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. వీటిలో ఆర్థికంగా వందలకోట్ల రూపాయల నిధులు అవసరం అయ్యే స్కీములు, కార్యక్రమాలు ఉన్నాయి. అవన్ని కలిపితే వేలకోట్లు కావల్సిరావచ్చు.


మనందరికి ఒక సందేహం వస్తుంది. ఇంత భారీగా మొదటే జగన్‌ వీటన్నిటిని అమలు చేయడం ఎలాగా అని? మన మాదిరే క్యాబినెట్‌లో ఉన్న మంత్రులకు సందేహం వచ్చింది. కొందరు ఆ విషయం ప్రస్తావించారు కూడా. కాని జగన్‌ ఒకటేమాట చెప్పారట. ఆ సంగతి తనకు వదలివేయండి అన్నారట. వీటిని బాగా అమలుచేసే బాధ్యత తీసుకోవాలని అన్నారు. అంతేకాదు.. అధికారులు మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు చేయరాదని, మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన స్పష్టంచేశారు.


ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఆయన ఒక క్లారిటీతో పాలన ముందుకు వెళ్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. అయితే తొలి క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల మొత్తం వ్యయం ఎంత అవుతుందని అంచనా వేయవలసి ఉటుంది. ఆయన ఎలా వీటిని అమలు చేస్తారన్నది అందరికి ఉత్కంఠ కలిగించే అంశమే. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్‌ ఏమిటంటే మన రాష్ట్రం కష్టాలలో ఉంది.. ఆర్థిక సంక్షోభంలో ఉంది.. అయినా మేము ఈ నిర్ణయాలు చేస్తున్నాం.. ఇలాంటి రోదనలతో కూడిన ప్రచారం చేయడానికి జగన్‌ ఇష్టపడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: