ఏపీలో టీడీపీకి ప్ర‌జ‌లు ఘోర‌మైన ప‌రాజ‌యాన్నే అందించారు. తాము ఓడిపోతామ‌ని కొంద‌రు టీడీపీ సీనియ‌ర్లు గెస్ చేసి నా.. ఇంత ఘోరాతి ఘోరంగా ఈ ఓట‌మి తాలూకు ప‌ర్య‌వ‌సానం ఉంటుంద‌ని మాత్రం ఎవ‌రూ అనుకోలేదు. ప్ర‌జాస్వా మ్యంలో గెలుపు ఓట‌ములు స‌ర్వ‌సాధార‌ణం కాబ‌ట్టి.. గెలిచిన పార్టీకి ఛాన్స్ ఇచ్చి ఓడిన పార్టీ ఆత్మ విమ‌ర్శ చేసుకుని త‌ప్పులు స‌రిదిద్దుకుని ముందుకు సాగ‌డం అనేది మామూలే. మ‌ళ్లీ ఐదేళ్ల‌లో ఎన్నిక‌లు రావ‌డం స‌హ‌జం. సో.. ఈ క్ర‌మంలో ఓడిన ఏ పార్టీ అయినా ఆత్మ విమ‌ర్శ చేసుకుని ముందుకు సాగుతుంది. తాజాగా ఏపీలో ఓట‌మి పాలైన టీడీపీ ఆత్మ విమ‌ర్శ చేసుకునేందుకు రెడీ అయింది. 


అయితే, స‌హ‌జంగానే గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానం, త‌ద్వారా ల‌భించిన ప‌ద‌వులు , వాటి వ‌ల్ల పొందిన గౌర‌వాది స‌త్కారాలు వంటివి ఇప్పుడు ఈ ఆత్మ విమ‌ర్శ‌కు స‌హ‌జంగానే అడ్డు ప‌డుతున్నాయి. దేశంలో నా క‌న్నా సీనియ‌ర్ లేడ‌ని చెప్పుకొన్న చంద్ర‌బాబుకు స‌హ‌జంగానే పార్టీ ఎందుకు ఓడింద‌నే కార‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డం అతిశ‌యం కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే.. త‌నకంటే పెద్ద‌వారు ఉన్న‌ప్పుడు త‌ను జ‌వాబుదారిగా ఉంటారు. అలా కాన‌ప్పుడు ఇలాంటి అతిశ‌య‌మే అడ్డు వ‌స్తుంది. ఇదంతా ఎందుకంటే.,. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అధికారం వెలగ‌బెట్టిన టీడీపీ అంతా తానే అని, త‌న కుఅడ్డు లేద‌ని, ప్ర‌జ‌లు త‌నవెంటే ఉన్నార‌ని భావించ‌డం, ఈ భావన హ‌ద్దులు మీర‌డం వంటివి ఇప్పుడు స‌మ‌స్య‌గా మారాయి. 


పార్టీలోకి లేటుగా వ‌చ్చినా.. లేటెస్టుగా నిర్వ‌హించిన స‌మీక్ష‌లో దివ్వ‌వాణి చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఆణిముత్యాల‌నే చెప్పాలి. అధికారుల‌పై ఆధార‌ప‌డ‌డం, త‌న సొంత సామాజిక వ‌ర్గం అధికారులు నేత‌లు చెప్పిన మాట‌ల‌నే ప్రామాణికాలుగా చంద్ర‌బాబు న‌మ్మ‌డం, ఓ ప‌త్రిక‌ను మీడియా అధినేత‌ను విచ్చ‌ల‌విడిగా అభిమానించి, వారు రాసింది, ప్ర‌సారం చేసిందే నిజ‌మ‌ని న‌మ్మ‌డం కూడా చంద్ర‌బాబు పుట్టిముంచింద‌నేది దివ్య‌వాణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యే త‌మ్ముళ్ల అవినీతి, దందాలు, ఉచిత ఇసుక మాఫియా, చింత‌మ‌నేని వైఖ‌రి, జేసీ వ్యాఖ్య‌లు వంటివాటిని అదుపు చేయ‌లేక పోవ‌డం ఎక్క‌డిక‌క్క‌డ భూక‌బ్జాలు, అధికారులు కూడా తేలుకుట్టిన దొంగ‌ల్లా మారిపోయిన వైనం....


అవినీతికి ఆల‌వాలంగా మారిపోయినవిధానం వంటివి ప్ర‌జ‌ల్లోటీడీపీకి వ్య‌తిరేక ఫ‌లితాన్ని ఇచ్చేలా చేశాయి. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను ప్ర‌తిప‌క్ష నేత‌గా కంటే ఓ నేర‌స్తుడిగానే చంద్ర‌బాబు చూశారు. ఆయ‌న‌పై కోడిక‌త్తితో జ‌రిగిన దాడిని త‌న వ్యంగ్య రాజ‌కీయాల‌కు వాడుకున్నారు. దీనిని ప్ర‌జ‌లు స‌హించ‌లేక పోయారు. ముఖ్యంగా జ‌గ‌న్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌డాన్ని ఊహించ‌లేక పోయారు. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ.. అన్ని యూట‌ర్న్ రాజ‌కీయాలు చేయ‌డంపై విస్తు పోయారు. ఫ‌లితంగా ఎన్నిక‌ల ఫ‌లితం రివ‌ర్స్ అయింది. మ‌రి క‌ళ్ల‌ముందు ఇన్ని క‌న‌బ‌డుతున్నా.. చంద్ర‌బాబు మాత్రంటీడీపీ ఓట‌మికి కార‌ణాలే క‌నిపించ‌డం లేద‌ని చెప్ప‌డం నిజంగా ఆయ‌న‌లోని అతిశ‌యోక్తిని స్ప‌ష్టం చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: