చంద్రబాబుకు సలహాలు ఇచ్చే పరిస్థితి ఎవరికి ఉంది. ఆ అవకాశం ఎవరికి ఉంటుంది. బాబు అలాంటి చాన్స్ ఇస్తారా. అసలు చంద్రబాబు మాట వింటారా. ఆయన రాజకీయంగా ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ కదా. అయినా చనువు కొద్దీ చెప్పేవారు ఉంటారుగా.


ఇపుడు అదే మాట వెటరన్ పొలిటీషియన్ జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. తాను చంద్రబాబు ఓడిపోయాక వెళ్ళి మాట్లాడానని, పరిస్థితి బాగులేదని, రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయని, అందువల్ల కొన్నాళ్ళు మౌనంగా ఉండమని సలహా ఇచ్చానని కేసీయార్ తాజాగా వెల్లడించారు. ఇపుడు ఎక్కడ చూసినా జగవ్ వేవ్ గట్టిగా ఉంది. ఈ టైమ్ లో  గమ్మునుండడమే మేలు అని జేసీ అంటున్నారు.


చంద్రబాబు చాలా తప్పిదాలు స్వయంగా చేశారని అందుకే ఓడిపోయారని అసలు గుట్టు జేసీ బయటపెట్టారు. పార్టీలో నాయకుల తీరు బాలేదని, అన్నీ కలసి కొంప ముంచేశాయని తనదైన విశ్లేషణ చేశారు. బాబు పది వేల రూపాయలు పసుపు కుంకుమ అంటూ పంచినా జనం ఓడించేశారని, ఇదంతా స్వయంక్రుతమని ఘాటు కామెంట్స్ చేశారు. సరే కానీ జేసీ చెప్పిన‌ట్లుగా బాబు మౌనంగా ఉండలేకపోతున్నారే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: