ఇటీవల కాలంలో మిస్టరీ సినిమాలు చాలా వస్తున్నాయి.  కథ చాలా ఆసక్తిగా ఉంటుంది.  సినిమా వరకు అది ఒకే.  కానీ, సినిమా సంగతి పక్కన పెడితే, నిజజీవితంలో ఓ మిస్టరీ జరిగింది.  అది మాములు మిస్టరీ కాదు.  ఎవరు అలాంటి విషయం జరుగుతుందని కూడా ఊహించి ఉండరు.  


బ్రతుకు తెరువు కోసం చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు.  కూలీనాలి చేసుకొని జీవనం సాగిస్తుంటారు.  అయితే, కొందరు అత్యాశతో ఎక్కువ జీతం కోసం విదేశాలకు పయనం సాగిస్తుంటారు.  ఇలా వెళ్లిన వ్యక్తులు ఏమయ్యారు తెలియడం లేదు.  అఫీషియల్ గా వెళ్తే సరే అనుకోవచ్చు.  


కానీ, 243 మంది మనుషులు రహస్యంగా ఓ బోటులో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు.  అలా బోటులో బయలుదేరిన వాళ్ళు ఏమయ్యారో ఇప్పటి వరకు అడ్రస్ లేదు.  దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.   బాధిత కుటుంబాలు వారి సమాచారం కోసం ప్రయత్నించగా ఈ విషయం బయటపడింది.  


జనవరి 11న కోచి సమీపంలోని మునంబం తీరంలో కేరళ పోలీసులు 50 బ్యాగులను గుర్తించారు. ఆ తర్వాతి రోజునే అదే తీరంలో మరికొన్ని బ్యాగులు దర్శనమిచ్చాయి. ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని గుర్తింపు కార్డులు, దస్త్రాలు కనిపించాయి.

బోటులో స్థలం సరిపోక లగేజీని ఇక్కడే వదిలేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానించి మిస్టరీగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ఎప్పటికి ఈ కేసును ఛేదిస్తారో చూడాలి.  
  


మరింత సమాచారం తెలుసుకోండి: