ఈనెల 17 వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు పారంభం కాబోతున్నాయి.  ఈ సమావేశాల్లో అనేక విషయాలు చర్చించనున్నారు.  మొదటి రెండు రోజులు ప్రొటెం స్పీకర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రధాని, మిగతా మంత్రులు, ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది.  అనంతరం ఉపరాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు.  


ఇది పూర్తయ్యాక 19 వ తేదీన పార్లమెంట్ పార్టీల అధినాయకులతో సమావేశం కాబోతున్నారు.  ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కు, వైకాపా అధ్యక్షుడు జగన్ కు అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లేఖలు రాశారు.  


వీరితో పాటు మిగతా పార్టీల అధినేతలు కూడా హాజరుకాబోతున్నారు.  మొత్తం ఐదు అంశాలపై ఆరోజు చర్చలు జరపబోతున్నట్టు తెలుస్తోంది.  పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంచే విధంగా సభలో ఉండటం, ఒక దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగేలా చూడటం, 75 సంవత్సరాల స్వాతంత్రంలో నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150 వ జయంతి వేడుకల నిర్వహణ.. 


ఈ ఐదు అంశాలపై ఈనెల 19 వ తేదీన మోడీ ఆయా పార్టీల నాయకులతో మాట్లాడబోతున్నారు.  అయితే, అన్ని పార్టీలకు ఆహ్వానాలు వెళ్లాయి.  మోడీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని పార్టీలు ఈ సమావేశానికి హాజరు అవుతాయి.  బాబు ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: