జగన్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇపుడు అతి జాగ్రత్తగా ఆయన అడుగులు వేస్తున్నారు. అసలు ఏపీకి ఏది ప్రయోజనమో కాదో కూడో కూడా తెలుసుకుని మసలుకుంటున్నారు. ఈ విషయంలో మొహమాటాలకు అసలు చాన్సే లేదంటున్నారు. పొలిటిచల్ ట్విస్ట్ ఇస్తారని అంటున్నారు.



అటువంటి జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి వెళ్తారా అనంది పెద్ద చర్చగా ఉంది. కేసీయార్ ఇవాళ విజయవాడ వస్తున్నారు. స్వయంగా జగన్ని పిలవాలనుకుంటున్నారు. సీఎం హోదాలో జగన్ కి ఇది తొలి ఆహ్వానం కూడా. అయితే జగన్ ఈ విషయంలో రెండో ఆలోచన కూడా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి వెళ్తే ఏపీ ప్రయోజనాలు దెబ్బతీసి కట్టిన ప్రాజెక్టుకు వెళ్తారా అన్న నిందను విపక్ష టీడీపీ వేసేందుకు రెడీగా ఉంది.


మరో వైపు ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్ట్ డిజైన్లు మార్చేసి కట్టారని, వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని అక్కడ కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క అంటున్నారు. జగన్ని రావద్దని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఈ ఓపెనింగు జగన్ కి అంత ముఖ్యం కాదు. ఆయన వెళ్ళినా వచ్చేది లేదు. వెళ్ళకపోతేనే రాజకీయ దుమారం ఆగుతుంది. అందువల్ల జగన్ ఆ దిశగా ఆలోచన చేసి రారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: