జూన్ నెల ప్రారంభమైన 16 రోజులు ముగిసినప్పటికీ ఇంకా భానుడు ప్రతాపం తగ్గలేదు. ఒక పక్క స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఇంత వేడిమిలో తమ పిల్లలను స్కూళ్ళకు పంపటానికి తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. రాష్ట్రంలో మరికొద్ది రోజుల పాటు విపరీతమైన ఎండ, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఒంటి పూట బడుల నిర్వహణ తేదీలను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.

గతంలో ఒకసారి జూన్ 12 నుంచి 16వ తేది వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా రుతుపనాల రాకపోవడంతో పిల్లలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈనెల 22వ తేదీ వరకు ఒంటి పూట బడులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టంచేసింది. వాస్తవానికి ఈనెల 17వ తేదీ వరచే ఒంటిపూట బడులు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత తగ్గకపోగా వడగాల్పుల తీవ్రత మరింత పెరిగి కొనసాగుతుం డడంతో ప్రభుత్వం ఒంటిపూట బడుల నిర్వహణ తేదీలను పొడిగించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల పాటు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఒంటి పూట బడులను 22వరకు నిర్వహించాలని తాజాగా ఆదేశాలను అన్ని పాఠశాలలకు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొ న్నారు. ఈనెల 24వ తేదీ నుంచి రెండు పూటలా పాఠశాలలు పని చేస్తాయని పాఠ శా ల విద్యాశాఖ ఉన్నతాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల్లో స్పష్టంచేశారు. ఆదేశాలను అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు పాటించాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: