ప్రపంచకప్లో భారత్ తన రికార్డ్ మెరుగుపరుచుకుంది.  పాకిస్తాన్ పై ఇప్పటివరకు ఓడిపోని రికార్డు ను కొనసాగించింది.  89 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది. 

 

అయితే పాకిస్తాన్ ఓటమికి  దేశ ప్రధాని మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన  సలహాను పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పాటించకపోవడం కూడా  ఓ కారణంగా తెలుస్తోంది.  టాస్ గెలిస్తే  ముందుగా బ్యాటింగ్ చేయాలని  పాక్ కెప్టెన్ కు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  సలహా ఇచ్చాడు.  పిచ్ మరీ తేమగా ఉంటే తప్ప  టాస్ గెలవగానే  మొదట బ్యాటింగ్ చేయాలని   ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా సూచించారు.

 

స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్,  బౌలర్లతో బరిలో దిగాలని,  ఒత్తిడి సందర్భాల్లో  పార్ట్  టైమర్లు  సరిగ్గా రాణించలేరని   ఇమ్రాన్ ఖాన్  ఆ దేశ జట్టుకు సలహా ఇచ్చాడు.  కానీ ఇమ్రాన్ ఖాన్ సలహాలు   పాక్ కెప్టెన్   ఏ మాత్రం పాటించలేదు.  పాకిస్తాన్ టాస్ గెలిచినా  ముందుగా బౌలింగ్  ఎంచుకుంది.

 

బ్యాటింగ్ పిచ్ అని తెలిసినా  కొన్ని రోజులుగా వర్షాలు  పడుతున్నందున..   తేమ  ఉంటుందని  పాకిస్తాన్  కెప్టెన్ భావించాడు.   అందుకే ముందు ఫీల్డింగ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నాడు.  కానీ అది బెడిసికొట్టింది..  పాకిస్తాన్ జట్టు పరాజయం పాలయింది.  మరి  ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన సలహా పాటించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి: