జగన్ అవినీతి పరుడు... లక్షల కోట్ల రూపాయలను అవినీతి చేశారు.  బెంగళూరులో ఉంది సమాంతర ప్రభుత్వం నడిపారు అని చెప్పి జగన్ ను అప్పట్లో అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో ఉంటారు.  ఆయనపై వివిధ కేసులు బనాయించారు.  అసలు జగన్ పై ఈ కేసులు పెట్టడానికి కారణం ఏంటి..?ఎందుకు పెట్టాల్సి వచ్చింది.  ఎవరి ప్రోద్బలంతో ఈ కేసులు బనాయించారు..

 

2009 వ సంవత్సరంలో జగన్ కడప పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత, ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి పంపించారు.  కానీ, అధిష్టానం దానిని పక్కన పెట్టి రోశయ్యకు అవకాశం ఇచ్చింది. 

 

జగన్ తన పదవికి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కడప నుంచి ఎంపీగా తిరిగి గెలుపొందారు.  కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి పార్టీని స్థాపించడంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి వైకాపాలో జాయిన్ కావడంతో.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది.  అప్పటి ఎమ్మెల్యే శంకర్ రావు చేత కేసు పెట్టించింది.  దానికి  యనమల సపోర్ట్ చేయడంతో.. జేడీని రంగంలోకి దించి జగన్ ను ప్రశ్నించే విధంగా చేశారు. 

 

జగన్ పై మోపబడిన అవినీతి కేసు జెడిపై ఒత్తిడి రావడంతో ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది.  అవినీతి కేసులో జగన్ ను కావాలని 16నెలలు మాత్రమే జైల్లో ఉంచగలిగారు. జగన్ పై మోపబడిన కేసుల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు.  అసలు అలాంటి కేసు లేని చోట ఉందని ఎలా ప్రూవ్ అవుతుంది.  లక్ష కోట్ల రూపాయలు అవినీతి అంటే మామూలు విషయమా చెప్పండి. 

 

వైఎస్ కుటుంబం ఎప్పటి నుంచో మైనింగ్ బిజినెస్ చేస్తుంది.  ఆ బిజినెస్ లో సంపాదించిన డబ్బు అక్రమ సంపాదన ఎలా అవుతుంది.  అక్రమంగా సంపాదించిన మాట వాస్తవమే అయితే.. ఇప్పటి వరకు ఆ కేసు ఎందుకు ప్రూవ్ కాలేదు.  అప్పటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి జగన్ పై ఇలా అవినీతి కేసును బనాయించారన్నది స్పష్టం అవుతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: