వారు సెల్‌ఫోన్ల ను వెంట తీసుకెళతారు గానీ, రైళ్లలో, బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు సెల్‌ఫోన్ల లో మాట్లాడరు. ఎక్కువగా ఆఫ్‌ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే వారు సెల్‌ఫోన్ల లో మాట్లాడుతుంటే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే అలా చేస్తారట. అంతేకాకుండా వారు తడిచిన గొడుగులు పట్టుకొని బస్సుల్లోకి రైళ్లలోకి ఎక్కరు. వాటి కోసం స్టేషన్లో ఏర్పాటుచే సిన ‘ఓపెన్‌ బాస్కెట్‌’ లో పడేసి వెళతారు. తిరుగు ప్రయాణంలో తీసుకుంటారు (వాటిని ఎవరు కూడా ఎత్తుకు పోరట). దీనికి కారణం ఆ తడసిన గొడుగు వల్ల రద్దీగా ఉండే రైళ్లలో తోటి ప్రయాణికుల బట్టలు తడుస్తాయనే ఉద్దేశమట.

Image result for discipline in japanese is because of mirror neurons within them


వారు ఎవరై ఉంటారు? ఇంత క్రమశిక్షణ ఖచ్చితంగా జపనీయుల సొత్తే కదా


మరి మనం ఇంటా బయట మనం సెల్‌ఫోన్ల ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. రైళ్లలో, బస్సుల్లో, కార్లలో పోతున్నప్పుడు కూడా వాటిని వాడుతుంటాం. మరికొందరు వాష్‌ రూము ల్లోకి వెళ్లినా సెల్‌ఫోన్లను వెంట తీసుకెళతారు. ఇందుకు జపాన్‌ ప్రజలు పూర్తి విరుద్ధం. 



ఇలాంటి మనస్తత్వం వారికి అల్వడటానికి కారణం  మిర్రర్‌ న్యూరాన్స్‌ స్పందన వల్ల ఇలాంటి ప్రవర్తన అబ్బుతుందని లాస్‌ ఏంజెలెస్‌లోని ‘డేవిడ్‌ జెవిన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ కు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌ అండ్‌ సోషల్‌ బిహేవియర్, బ్రెయిన్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు తేల్చి చెప్పారు. 

Image result for mirroring behavior in relationships

వాస్తవానికి మనిషి బ్రెయిన్‌లో మిర్రర్‌ న్యూరాన్స్‌ అంటూ ప్రత్యేకమైనవి ఏమీ ఉండవని, ‘మిర్రరింగ్‌ బిహేవియర్‌’ అంటే మన వల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలుగు తుందా? అనే మనం ఆలోచన కలగటం, తోటి ప్రయాణికులను చూస్తూ ఆ ఇబ్బందులు ఏమిటో మనం గుర్తించినప్పుడు మెదడులోని కొన్ని న్యూరాన్ల లో స్పందన కలుగుతుందని, తద్వారా అలా ప్రవర్తించరాదనే ఆలోచన వస్తోందని పరిశోధకులు తెలిపారు.

Related image

ఇలాంటి ప్రవర్తన ప్రపంచంలోకెల్లా జపాన్‌ ప్రజల్లోనే ఎక్కువుగా ఉందట. సహజంగానే వారు సమాజంతో కలిసికట్టుగా కదులుదాం లేదా జీవించాలనే ‘కమ్యూనిటీ ఫీలింగ్‌’ వారిలో ఉండడం - వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు, వారి భిన్న సంస్కృతులను తెలుసుకోవడం - వారితో మమేకమవడం ద్వారా వారిలో ఆ గుణం అంటే ‘తోటివారికి ఇబ్బంది కల్గించరాదు’ అనే ఆలోచన పెరుగుతోందట. అలాంటి గుణాలవలననే జపనీయులను కూడా ఇతరులు చాలా గౌరవంగా చూసుకుంటారనే విషయం తెల్సిందే. 
Image result for americans
ముఖ్యంగా భిన్నజాతులు, భిన్న భాషలవారు నివసించే పరాయిప్రాంతం, అంటే విదేశాల్లో పర్యటించడం వల్ల అలాంటి గుణం ద్విగుణీకృతం అవుతుందట. అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ప్రజల్లో ‘సెల్ఫ్‌’ ఎక్కువట. అంటే ‘నేను పైకి రావాలి, నేను ఎదగాలి. ఎవ్వరి మీద ఆధారపడరాదు’ అన్న ఆలోచనే నేను-అంటే సెల్ఫ్ కు దారి తీస్తుందట. 



జపాన్‌ ప్రజల్లో మనం అనే గుణం ఉందట. మనం అభివృద్ధి చెందాలి. మనం పైకి రావాలి. అందుకు పరస్పరం సహకారం అవసరం అని వారు భావిస్తారట.  తోటి వారిని ఇబ్బంది పెట్టని ప్రవర్తన లేదా సంస్కృతి మనలో కూడా పెరగా లంటే దేశ, విదేశాలు తిరుగుతూ భిన్న సంస్కృతుల ప్రజలను కలుసుకుంటూ వారితో కలిసి మమేకం కావాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు. 
Image result for japanese with community feeling

రోజువారి పనులకు విరామమిచ్చి - సుందర పర్యాటక ప్రాంతాలకు, అందమైన జలపాతాలను ఆస్వాదించేందుకు వెళితే మనసు ఉల్లాసంగా ఉంటుందనే విషయం అనుభవ పూర్వకంగా మనందరికి తెల్సిందే.  ప్రవర్తనలో మార్పు రావాలంటే మాత్రం ఇతర పర్యాటకులతో కలిసిపోవడం లేదా అక్కడి స్థానికులతో కలిసి పోవడం అవసరం అట. విమానాల్లో తిరుగుతూ లగ్జరీ హోటళ్ల లో గడపడం కంటే రైళ్ల లోనో, సొంత వాహనాల్లోనో తిరుగుతూ స్థానిక ప్రజలను కలుసుకునే వెసులుబాటున్న చోట బస చేయాలట. ముఖ్యంగా మానవ హక్కులను గౌరవించే దేశాల్లో ముందుగా పర్యటించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: