చంద్రబాబునాయుడుకు వైసిపి ఎంఎల్ఏ అబంటి రాంబాబు తీవ్ర హెచ్చరికలు చేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై అంబటి రెచ్చిపోయారు. తమ ఐదేళ్ళ పాలనలో సుపరిపాలన అందించామని చంద్రబాబు అండ్ కో చెప్పకోవటంపై అంబటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

సుపరిపాలన అందించినట్లు మీరు అనుకోవటం కాదు చెప్పుకోవటం కాదన్నారు. మీరు సుపరిపాలన అందించినట్లుగా జనాలు చెప్పుకోవాలంటూ ఎద్దేవా చేశారు. నిజంగానే సుపరిపాలన అందిస్తే మరి జనాలు వైసిపికి 151 సీట్లు ఎందుకిచ్చారంటూ నిలదీశారు.

 

2014 ఎన్నికల సమయంలో జనాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు సంపూర్ణంగా అమలు చేయలేదంటూ మండిపడ్డారు. బెల్టు షాపుల నియంత్రణపై మొదటి సంతకం పెడతానన్న చంద్రబాబు హామీని ఇపుడు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి అమలు చేయబోతున్నట్లు చెప్పారు.

 

40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు జనాలు 23 సీట్లు ఇస్తే 10 ఏళ్ళ అనుభవం మాత్రమే ఉన్న జగన్ కు 151 సీట్లు ఎందుకిచ్చారో చంద్రబాబు నిజాయితీగా ఆలోచించుకోవాలని చురకలంటించారు.  23 మంది ఎంఎల్ఏలను మాత్రమే ఇచ్చారంటే టిడిపి ఉనికి ప్రమాదంలో పడిందన్న విషయాన్ని చంద్రబాబు అండ్ కో గ్రహించాలన్నారు. కాబట్టి తమ ఓటమికి అసలైన కారణాలను నిజాయితీగా సమీక్షించుకోవాలంటూ చెప్పటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: